దేశంలో సార్వ‌త్రిక స‌మ‌రం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అందిరి చూపూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌పై ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్క‌డ ఎవ‌రుఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తే.. వారికి ఢిల్లీలో పీఠం అదిరోహించేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ గ‌ద్దెపై క‌న్నేసిన పార్టీలు యూపిని ప్ర‌త్యేకంగా తీసుకుని మ‌రీ ప్ర‌చారం చేస్తారు. లెక్క‌కు మిక్కిలి పార్టీలు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, అప్నా ద‌ళ్‌,  రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ పార్టీలు పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఉన్న  బ‌ల‌మైన ప‌ట్టు.. యూపీలో లేక పోవ‌డం పార్టీని క‌ల‌వ‌ర‌పరుస్తున్న విష‌యం.

Image result for up politics

ఇక్క‌డ ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు విముఖత చూప‌డం వంటివి కాంగ్రెస్‌ను ఒంటరిని చేశాయి.  ప్ర‌ధాన పార్టీ బీజేపీగ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎంపీ సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 78  స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 71 చోట్ల విజ‌యంసాధించింది. ఇక‌, ఈ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న అప్నాద‌ళ్ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా విజ‌యం సాధించింది. ఇక‌, అప్ప‌టి రూలింగ్ పార్టీ.. ఎస్పీ 78 స్థానాల్లో పోటీ చేసి.. కేవ‌లం ఐదు చోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించింది. అదికూడా పార్టీనిబ‌ట్టి కాకుండా వ‌క్తుల ఇమేజ్‌పైనే విజ‌యం సాధించారు. ఇక‌, మ‌రో ప్రాంతీయ పార్టీ మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ అస‌లు ఖాతా కూడా తెర‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


ఏకంగా 80 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ.. ఒక్క చోట కూడా విజ‌యం సాధించ‌లేక పోవ‌డంతో ఇప్పుడు క‌సిగా ప‌నిచేస్తుం డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. మొత్తం 66 స్థానాల్లో పోటీ చేసింది. అయితే, పార్టీ లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మాత్ర‌మే విజ‌యం సాధించారు. మిగిలిన 64 మంది కూడా ఘోరంగా ఓడిపోయా రు. ఓటు బ్యాంకు కూడా కేవ‌లం 6 శాత‌మే వ‌చ్చింది. ఇలా అతి పెద్ద జాతీయ పార్టీ యూపీలో చిన్న‌బోయిం ది. ఇక‌, ప్రాంతీయ పార్టీ అప్నాద‌ళ్‌.. రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు స్థానాల‌ను కూడా త‌న ఖాతాలో వేసుకుంది. రాష్ట్రీ య లోక్‌ద‌ళ్ అనే ప్రాంతీయ పార్టీ కూడా పోటీ చేసినా ప్ర‌యోజ‌నం మాత్రం క‌నిపించలేదు. 

Image result for up politics

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. యూపీలో మ‌రోసారి పాత ఫ‌లితమే రిపీట్ అవుతుందా? అంటే కాద‌నేది అంద‌రూ చెబుతు న్న మాట‌. దేశ‌వ్యాప్తంగా 2014లో ఉన్న ఎన్నిక‌ల గాలి, మార్పు కోరుతున్న ప్ర‌జ‌లు ఇప్పుడు లేర‌నే చెబుతున్నారు. పైగా 2017లో  జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే, ఆ స‌మ‌యంలో మ‌ఠాధిప‌తిగా ఉన్న యోగి ఆదిత్య నాథ్‌ను సీఎంను చేయ‌డం, ఇక‌, సీఎంగా ఆది వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లు చేయ‌డం వంటివి ఇప్పుడు బీజేపీపై ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్లు, ముస్లింల‌పై జ‌రిగిన దాడులు, గోహ‌త్య‌ల పేరుతో జ‌రిగిన మార‌ణ‌కాండ‌ల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం ఉంద‌నే బల‌మైన ప్ర‌చారం వంటివి గ‌తంలో బీజేపీ సాధించిన ఓట్ల‌కు గండి కొట్టేలా ఉంద‌ని అంటున్నారు. 


ఇక‌, ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఎస్పీ, బీఎస్పీలు క‌లిసి క‌ట్టుగా ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నాయి. ఇక‌, కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టం అన‌డం ద్వారా కూడా ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌.. బ్రాహ్మ‌ణ ఓటు బ్యాంకు బీజేపీకి ప‌డ‌కుండా ప‌క్కా వ్యూ హంతో ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, యూపీలో కుల ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ఇక్క‌డ సామాజిక వ‌ర్గాల్లో మెజారిటీగా ఉన్న యాద‌వులు, జాట్లు ఈ ద‌ఫా బీజేపీకి అనుకూలంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో మైనార్టీ ఓట్లు కూడా చీలిపోవ‌డం ఖాయమ‌ని అంటున్నారు. బీజేపీ అవ‌లంబించిన ఆర్థిక విధానాల‌తో ఉపాధి లేకుండా పోయింద‌నే యువత ఆక్రంద‌న కూడా ఈ ద‌ఫా యూపీ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు. 

Image result for up politics

ద‌ళితులు, జాట్లు కూడా ఈ ద‌ఫా కీల‌కం కానున్నారు. అయితే, వీరంతా త‌మ వెంటే ఉన్నార‌ని అంటున్న బీఎస్పీ.. వ్యాఖ్య‌లు స‌త్య‌దూరంగా క‌నిపిస్తున్నాయి. 2014లో బీజేపీపై పూర్తి విశ్వాసంతో ముఖ్యంగా న‌రేంద్ర మోడీపై ఉన్న న‌మ్మంతో ప్ర‌జ‌లు ఆయ‌న వెంట న‌డిచార‌నేది వాస్త‌వం. అయితే, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటివి ప్ర‌జ‌ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను పెంచాయి. ఈ ప‌రిణామం ఇప్పుడు బీజేపీ ఓట్ల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఫ‌లితంగా 35 సీట్ల‌కే ప‌రిమిత‌మైనా ఆశ్చర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఎస్పీ, బీఎస్పీ కూట‌మికి దాదాపు 40 సీట్లు వ‌స్తాయ‌ని ఇప్ప‌టికే ప్రాధ‌మిక అంచ‌నాలు వ‌చ్చాయి. కాంగ్రెస్ కూడా ఈ ద‌ఫా పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్రియాంక గాంధీ ప్ర‌చారం ఆ పార్టీలో ఊపు తెస్తుంద‌ని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. గ‌త ఎన్నిక‌లకంటే కూడా భిన్న‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: