టీడీపీ నేతలకు హైకోర్టు షాకిచ్చింది. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం కేసులో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు నోటీసులు జారీచేసింది.   రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు జారీ చేసి షాక్ ఇచ్చింది. 


ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఈ వివాదం సంచలనం అయింది. ఈ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను అప్పట్లో ఆదేశించింది.  


2017 రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విచారణ చేపట్టింది. జయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. బాలసుబ్రమణ్యం గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బోండా ఉమ చేయిచేసుకున్నారు. వివాదం పెద్దదవడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకున్నారు.


బాలసుబ్రమణ్యానికి కేశినేని నానితో క్షమాపణలు చెప్పించారు. దాంతో అప్పటితో ఆ వివాదం సద్దుమణగింది. ఐతే మళ్లీ ఇన్నాళ్లు హైకోర్టు కలగజేసుకొని టీడీపీ నేతలకు నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ కేసు విచారణను జూన్‌కు వాయిదా వేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: