మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎన్నికల విషయానికి వస్తే ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటంటే.. ఆయన ఇప్పటివరకూ పోటీ చేసిన స్థానం నుంచి మళ్లీ పోటీ చేయలేదు.. ప్రతిసారీ కొత్త స్థానం నుంచే పోటీ చేశారు. అలాగే ఆయనకు ఇంతవరకూ ఓటమి కూడా లేదు. 


అంతే కాదు.. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ ఇలా అన్ని పార్టీల నుంచి కూడా పోటీ చేసిన ఘనత ఆయనది. ఇప్పటి వరకూ ఓటమి పలకరించలేదు. కానీ ఈసారి మాత్రం మంత్రి గంటాకు రోజులు అంతగా బాగా లేవన్న టాక్ వినిపిస్తోంది. 

భీమిలి సిట్టింగ్ ఎంపీ అయిన గంటాను చంద్రబాబు విశాఖపట్నం నార్త్ నుంచి బరిలో దింపారు. ఈ సీటు తెలుగుదేశం అంత సేఫ్టీ కాదు. కానీ చంద్రబాబు మాట కాదనలేక అక్కడ పోటీకి దిగారు. దీనికి తోడు ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొని ఉంది. 

టీడీపీ నుంచి గంటా.. వైసీపీ నుంచి కేకే రాజు, జనసేన నుంచి ఉషారాణి్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ, జనసేన బలంగానే ఉన్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుపై అంత వ్యతిరేకతా లేదు.  ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపు ఓట్లు మెజారిటీ జనసేనకు పడినట్టు తెలుస్తోంది. ఇన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నచోట మంత్రికి ఈసారి గెలుపు చాలా కష్టమన్నటాక్ వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: