మంగళగిరి.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ నియోజక వర్గం వైపే.. భవిష్యత్‌లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు,  మంత్రి నారా లోకేశ్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం ఇది. ఈ ఎన్నికల్లో లోకేశ్ ఓడితే.. అది టీడీపీకే అవమానం అవుతుంది. 


అయితే ఈ స్థానంలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ నేత ఆళ్ల రామకష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సారి బలమైన ప్రత్యర్థి నిలబడం వల్ల ఆళ్ల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఐతే పోలింగ్ జరిగిన తీరుతో ఆర్కేలో విశ్వాసం పెరిగింది. 

మంగళగిరిలో తాను తప్పక గెలుస్తానని ఇప్పటికే ఆర్కే ప్రకటించారు. అయితే ఎంత మెజారటీ వస్తుందన్న సంగతి మాత్రం చెప్పలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మరీ ఎక్కువ చేసి చెప్పనని..కానీ 15 వేల మెజారిటీ వస్తుందని అన్నారు. 

లోకేశ్ మీద గెలిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన కు తన మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తానని మంగళగిరిలో జరిగిన భారీ బహిరంగ షభలో జగన్ ప్రామిస్ చేశారు. అంటే.. ఇక మంగళగిరి ఆర్కే మంత్రి పదవి అందుకునే ఛాన్స్ ఉన్నట్టేనా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: