నారా లోకేశ్ ఈసీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈసీ పక్షపాతవైఖరి అవలంభిస్తోందంటూ ట్వీట్లతో రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా? అంటూ నిలదీశారు. 


ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారని లోకేశ్ గుర్తు చేశారు. 

 కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం ? అంటూ ఈసీని కడిగిపారేశారు. అంతా బాగానే ఉంది. కానీ లోకేశ్ చిన్న లాజిక్ మరిచిపోయారు.  తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కోడ్ వేరే ఉంటుంది. త్వరలో వేరే ప్రభుత్వం రాబోతున్నందువల్ల ఈ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అధికారులను ప్రభావితం చేయకూడదు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు.  అదీ సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి: