ఏపీ ఎన్నికలపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ సర్వే విడుదలైంది. ఈ సర్వే ప్రకారం వైసీపీ 100 స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.  టీడీపీ 72  స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. జనసేన కేవలం మూడు స్థానాల్లోనే గెలుస్తుందని ఈ ఛానల్ అంచనా వేస్తోంది. 


అదే నిజమైతే టీడీపీ బలమైన ప్రతిపక్షంగా అవతరిస్తుందన్నమాట. అంటే గత ఎన్నికల్లో జగన్‌ పార్టీకి వచ్చినన్ని సీట్లు ఇంచుమించు టీడీపీకి వస్తాయి. ఈ సర్వే అంచనాలు నిజమైతే.. చంద్రబాబు తనకు ఉన్న మీడియా అండతో ప్రభుత్వంపై మొదటి నుంచే దాడి ప్రారంభించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ చర్యలు, తప్పొప్పులపై ఉద్యమాలు తీవ్రం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్న అనుభవాన్ని చంద్రబాబు ఈసారి బాగా ఉపయోగించుకోవచ్చు. ఎల్లో మీడియా అండతో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వండి వార్చే ప్రమాదం బాగానే ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే జగన్‌కు చుక్కలు చూపించేలా ప్రవర్తించే ఛాన్స్ ఉంది.

అయితే.. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు వైసీపీ నుంచి దాదాపు 20  మందికిపైగా ఎమ్మెల్యేలను టీడీపీ వైపు లాక్కున్నారు. మరి ఈసారి జగన్ కూడా అదే రూట్‌లో వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసి ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇవన్నీ ఈ సర్వే అంచనాలు నిజమైతేనే సుమా.



మరింత సమాచారం తెలుసుకోండి: