తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు దేశంలోనే శక్తివంతమైన సీఎంలలో ఒకరు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అన్న రేంజ్‌లో కాంగ్రెస్ బలహీన  పడింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా అడిగేవారు లేరు. ఈ పరిస్థితిని కేసీఆర్ ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించొచ్చు


ఆయన ఇటీవల రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించారు బాగానే ఉంది. అలాగే ఆయన ఈ కార్పొరేట్ కళాశాలపైనా దృష్టి పెడితే బావుంటుంది. ఇంటర్‌ ఫలితాలు వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు  ప్రాణాలు తీసుకుంటున్నారు. 

దీనికి కార్పొరేట్ కళాశాలల ఒత్తిడే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న నేపథ్యంలో అసలు ఇంటర్‌ విద్యార్థలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కార్పొరేట్ కళాశాలలు ర్యాంకులకోసం, మార్కుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. 

ఈ కళాశాలల్లో సైకాలజిస్టులు ఉండాలి.. వారానికోసారి తల్లిదండ్రులను కలవనివ్వాలి.. ఇలాంటి నిబంధనలు ఏమాత్రం పాటించకుండా పిల్లల ప్రాణాలు తీస్తున్న కార్పొరేట్ కళాశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. వాటి ధనదాహం కోసం విద్యార్థలను బలిచేయడంపై ఆయన ఫోకస్ చేస్తే.. లక్షల మంది విద్యార్థలు తల్లిదండ్రులు సంతోషిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: