కేసీఆర్ సొంత పత్రికలో కొన్ని రోజులుగా రెవెన్యూ శాఖలో అవినీతి గురించి కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ సొంత పత్రికలోనే ఇలాంటి కథనాలు రావడం వెనుక ఆ శాఖను రద్దు చేయాలన్న ఆలోచనే కారణమని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అంటున్నారు. దీనిపై ఆయన ఓ ఛానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్నారు. 


కేసీఆర్ రెవెన్యూ శాఖపై దృష్టి సారించడం మంచి పరిణామని నాగేశ్వర్ అన్నారు. అదే సమయంలో సొంత పత్రికలో వస్తున్న రెవెన్యూ శాఖ వ్యతిరేఖ ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సొంత పత్రికలో వస్తున్న కథనాలు నిజమైతే..ఐదేళ్లుగా ఆశాఖను చూస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. 

అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల ముందు అవినీతిరహిత పాలన అందించామని కేసీఆర్  చెప్పుకున్నారని..కానీ ఇప్పుడు సొంత పత్రికే సర్కారు అవినీతిని గుట్టలుగుట్టలుగా బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. మరి ఈ కథనాలు నిజమైతే కేసీఆర్ ఎన్నికల ముందు అబద్దం ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. 

కేసీఆర్ సొంత పత్రికలో కథనాలు నిజమైతే.. మరి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు రెవెన్యూ శాఖను పర్యవేక్షించిన మంత్రులు, ముఖ్యమంత్రులు అందుకు బాధ్యులు కాదా అని నిలదీశారు. అవినీతి కేవలం అధికారులదేనా.. మంత్రులకు ఈ బాధ్యత లేదా నాగేశ్వర్ అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: