శ్రీలంకలో ఉగ్రవాదులు చెలరేగిపోయి చేసిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 280 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదా‌ని భారత్ ముందే పసిగట్టిందా.. ఈ విషయంలో శ్రీలంకను ముందుగానే హెచ్చరించిందా..?


ముందుగా హెచ్చరించినా శ్రీలంక ఉగ్రదాడుల నుంచి తమ పౌరులను కాపాడుకోలేకపోయిందా... అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడే భారత ప్రధాని మోడీ తమను ముందే హెచ్చరించారన్న విషయం మీడియాకు చెప్పారు.

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పు అనే విషయం భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఉగ్రవాద బాధితురాలిగా ఇండియా తన వ్యవస్థలను మెరుగుపరుచుకుంది. నిఘా, నిరోధక, దర్యాప్తు వ్యవస్థలన్నీ ఒకే తాటిపైకి తెచ్చి నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ.. NIAను ఏర్పాటు చేసుకుంది. 

ఇప్పుడు ఈ NIA ఇచ్చిన సమాచారం ఆధారంగానే మోడీ శ్రీలంకను ముందే హెచ్చరించగలిగారు. కానీ ముందుగా సమాచారం ఉన్నా.. ఆత్మాహుతి దాడులను నిరోధించడం అంత సులభం కాదు. కానీ ఇకనైనా ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిరోధానికి చేతులు కలపాలి. పరస్పర సహకారం అందించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: