ఎన్నికలు ముగియడంతో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, ఇత‌ర‌ పక్షాలకు ప్రచారం చేసి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌స‌భ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థుల గెలుపోటములపై సమీక్ష చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో తెలుగుదేశం పార్టీ నేతలు ఖ‌చ్చితంగా రెండు వేల శాతం మళ్ళీ ఏపీలో తామే అధికారంలోకి వస్తామని మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టిడిపి నేతల మేకపోతు గాంబీర్యం సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం సమీక్షల్లో చాలా మందికి ముఖం మీదే మీరు ఓడిపోతున్నారు అని చెప్పినట్టు తెలుస్తోంది. ప్ర‌చార‌ప‌ర్వం నుంచి పోలింగ్ వ‌ర‌కు ఎవరెవరు ఎక్కడ ? తప్పులు చేశారు, టిడిపి నేతలు ఎందుకు ? వెనుకబడిపోయారు అన్న అంశాలపై ఇప్పటికే చంద్రబాబు వద్దకు పలు నివేదికలు చేరడంతో వాటిని ఆధారంగా చేసుకుని టిడిపి సీట్లలో ఎందుకు ? ఓడిపోతుంది కూడా ఆయన చెప్పినట్టు టిడిపి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 


పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమీక్షలో పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులు బూత్ స్థాయి నుంచి ఎక్కడెక్కడ ఎంత శాతం పోలింగ్ జరిగింది, మహిళల ఓట్లు ఎంత పోల‌య్యాయి అన్న వివరాలతో సమీక్షకు హాజరయ్యారు. ఈ సమీక్షలో చాలా మంది అభ్యర్థులు పసుపు కుంకుమ తాము గెలుస్తామ‌న్న ధీమాతో సరిగా పోల్ మేనేజ్‌మెంటును కూడా పట్టించుకోలేదని తేలిసింది.  ఇక కొందరు మాత్రం పసుపు - కుంకుమ కేవలం కొందరిమీకి మాత్రమే అందిందని... చివ‌రిలో బ్యాంకులకు వెళ్లి వారికి డబ్బులు లేని కారణంగా వారికి పంపడంతో ఆ ప్రభావం పోలింగ్  పడినట్టు బాబుకు చెప్పినట్టు సమాచారం. ఇక ఉద్యాన పంటల రైతులకు రుణమాఫీ లేకపోవడంతో వారంతా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని ఈ ప్రభావం కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందని కూడా అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. 


ఇక ఇటు ఎమ్మెల్యే అభ్యర్ధులు అటు చంద్రబాబు తప్పులను మరొకరిపై పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్ధులు సరిగా ముందుకు వెళ్లలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తే... అందుకు కౌంటర్‌గా వారు తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు అందరికీ అందకపోవడము లేదా ఇతర‌త్రా సమస్యలను సాకుగా చూపి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సమీక్ష ముగిసిన అనంతరం చంద్రబాబు గెలుస్తామని అని పైకి చెబుతున్నా... సమీక్ష మొత్తం ఆయన చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోతుంద‌న్న‌ విషయాన్ని చెప్పడాన్ని బట్టి చూస్తే... ఆయనలో ఓట‌మిపై ఎక్క‌డో ఓ సందేహం అన్నది ఇప్పటికే ఏర్పడింద‌న్నది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: