అనంతపురం ఎంపీ సీటును తెలుగుదేశం నిలబెట్టుకుంటుందా..లేక.. ఇక్కడ వెలుగు అధికారిగా ప్రజల మన్ననలు పొంది వైసీపీ నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య గెలుస్తారా.. అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే తలారి రంగయ్య ఆశలు నెరవేరకపోవచ్చని తాజాగా సర్వే ఒకటి చెబుతోంది. 


న్యూ ఆంధ్రా సర్వే పేరిట విడుదలైన సర్వేలో అనంతపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకుంటోందట. ఇక్కడ జేసీ పవన్ గెలుపు ఖాయమేనట. అయితే అనంతపురం ఎంపీని వైసీపీ గెలుస్తుందన్న అంచనాలు మొదటి నుంచీ ఉన్నాయి. 

కానీ జేసీ బ్రదర్స్ తమ వారసులను ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేయించారు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ కుమారుడు.. అనంతపురం ఎంపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేశారు. కుమారుల భవిష్యత్ కోసం జేసీ చాలా కష్టపడ్డారు. 

చివరకు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో డబ్బు విచ్చలవిడగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని జేసీ స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కనీసం 50 కోట్లు ఖర్చు చేశామని మీడియా ముందే చెప్పిన జేసీ వాస్తవంగా ఇంకెంత ఖర్చు చేసి ఉంటారోనన్న చర్చ సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: