Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:52 pm IST

Menu &Sections

Search

అన్న‌దాత ఆగ్ర‌హం... ఆ టీడీపీ ఎమ్మెల్యేకి ఎఫెక్టేనా...!

అన్న‌దాత ఆగ్ర‌హం... ఆ టీడీపీ ఎమ్మెల్యేకి ఎఫెక్టేనా...!
అన్న‌దాత ఆగ్ర‌హం... ఆ టీడీపీ ఎమ్మెల్యేకి ఎఫెక్టేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో గ‌డిచిన 11వ తారీకు జ‌రిగిన సార్వ‌త్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక చిత్రాలు క‌నిపించాయి. ప్ర‌భుత్వం ఒక ప‌క్క త‌మ ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల సంక్షేమం వంటివి భారీ ఎత్తున ప్ర‌భావం చూపిస్తాయ‌ని ప్ర‌చారం చేసినా.. అండ‌ర్ క‌రెంటుగా మాత్రం ఎమ్మెల్యేల‌పైనా, ఎంపీల‌పైనా ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆగ్ర‌హం మాత్రం ఓట్ల‌రూపంలో క‌నిపించింద‌ని అంటున్నారు. రాష్ట్రంలో ని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌లు పీక‌ల వ‌ర‌కు కోపంతో ఉన్నారు. బ‌హుశ ఈ విష‌యాన్ని ముందు గానే గ్ర‌హించారో ఏమో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌ను చూసి ఓటేయాల‌ని ప్ర‌చారం చివ‌రి రోజుల్లో నెత్తీనోరూ బాదు కుని మ‌రీ ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. 


``ఒక‌రిద్ద‌రు మిమ్మ‌ల్ని బాధ‌పెట్టార‌ని బాధ‌ప‌డొద్దు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా పార్టీకి ఓట్లేయండి. నాయ‌కుల‌ను మీకు చేరువ చేస్తాను. మీ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడ‌తాను`` అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకొచ్చారు. అయితే, అప్ప‌టికే చేతులు కాలిపోయిన ప‌రిస్థితి టీడీపీలో క‌నిపించింది. ఇసుక దందాలు స‌హా అనేక రూపాల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పేరుకే ఉచిత ఇసుక.. కానీ, సాధార‌ణ రోజుల్లో అంటే ఉచితం అన్న బోర్డు లేన‌ప్పుడు కంటే కూడా దారుణంగా ప్ర‌జ‌లు డ‌బ్బులు ఖ‌ర్చు చేసి ఇసుక‌ను కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తీసుకువ‌చ్చిం ది. ఇక‌, కృష్ణాజిల్లాలోని ఓనియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేపై ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు లేక‌పోయినా.. ఆయ‌న అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేద‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. 


దీంతో ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో స‌ద‌రు ఎమ్మెల్యేకు రైత‌న్న‌ల ఆగ్ర‌హ‌మే శాపంగా మారుతుంద‌న్న చ‌ర్చ‌లు నియోజ‌క‌వ‌ర్గంలో న‌డుస్తున్నాయి. విజ‌య‌వాడ న‌గ‌రానికి ఆనుకుని అతి స‌మీపంలోనే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చెరుకు రైతులు ఎక్కువ‌గా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వారి స‌మ‌స్య‌లు నేటికీ అప‌రిష్కృతంగానే ఉన్నాయి. వ్య‌వ‌సాయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చాడ‌నే సానుభూతితో 2014లో స‌ద‌రు నాయ‌కుడికి ప్ర‌జ‌లు జైకొట్టారు. అయితే, మూత‌బ‌డిన చెర‌కు ఫ్యాక్ట‌రీల‌ను తెరిపించ‌డంలోను, విమాశ్ర‌య విస్త‌ర‌ణ‌కు ఇచ్చిన రైతుల భూముల‌కు స‌రైన ప‌రిహారం ఇప్పించ‌డంలోనూ ఆ ఎమ్మెల్యే పూర్తిగా చేతులు ఎత్తేశారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌ల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌లు కూడా ఎమ్మెల్యేకు ఇబ్బంది క‌రంగా మారాయి. 


మొత్తంగా ఎమ్మెల్యే మంచి వాడే అయినా.. ఆయ‌న ప‌నితీరుకు మాత్రం మైన‌స్ మార్కులు ప‌డ్డాయి. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యే గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుంచి త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఆయ‌న అస‌లు మీడియా ముఖం కూడా చూడ‌క‌పోవ‌డం వెనుక స‌ర్వే నివేదిక‌లే కార‌ణ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


ap-election-2019-andhrapradesh-tdp-cm-chandrababu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హ‌రీష్‌తో ఛాలెంజ్ చేసి ప‌రువు పోగొట్టుకున్న కేటీఆర్‌
మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ను ఓడిచింది ఎవ‌రంటే..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ నారీ ప్ర‌భంజనం
జ‌గ‌న్ గురించి వైర‌ల్ అవుతోన్న మెసేజ్‌... అదృష్ట సంఖ్య ఇదే
జ‌గ‌న్ సునామిలీలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ ప్యాకేజీలు
ఏపీలో వైసీపీకి ప‌ద‌వులే ప‌ద‌వులు... టీడీపీకి మ‌ళ్లీ జీరోనే
తెలంగాణ‌లో ' కారు టైరు పంక్చ‌ర్‌ ' కు మెయిన్ రీజ‌న్ ఇదే
బాబోరు 23 మంది ఎమ్మెల్యేల‌ను కొంటే... 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు..
హాట్‌సీట్ ( గ‌న్న‌వ‌రం ) : ఫ‌్యాన్ గాలిలోనూ వంశీ గెలుపు వెన‌క రీజ‌న్ ఇదే
హాట్‌సీట్ ( విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ) : ప‌్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్‌లో ' బొండా ' ఉమా అవుట్‌... ' మ‌ల్లాది ' దే గెలుపు
హాట్‌సీట్ ( కాకినాడ సిటీ ) : జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్‌దే గెలుపు
హాట్‌సీట్ ( మండ‌పేట ) : టీడీపీ కంచుకోట ప‌దిల‌మే... వేగుళ్ల హ్యాట్రిక్‌
హాట్‌సీట్ ( మైల‌వ‌రం ) :  దేవినేని ఉమాపై కేపీ సూప‌ర్ రివేంజ్‌
హాట్‌సీట్ ( జ‌గ్గంపేట ) : పార్టీ మారి ఓడిన నెహ్రూ.... పార్టీ మారి గెలిచిన చంటిబాబు
విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో సూప‌ర్ ట్విస్ట్‌... 15 ఓట్ల‌తో మ‌ల్లాది విష్ణు గెలుపు
బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో జ‌న‌సేన బోణీ కొట్టిందోచ్‌
హాట్‌సీట్ ( మంగ‌ళ‌గిరి ) : లోకేష్ ఓట‌మి... త‌న‌ కెరీర్‌లో ఓ పీడ‌క‌ల‌
హాట్ సీట్ ( పొన్నూరు ): సెంటిమెంట్‌కు బ‌లైన న‌రేంద్ర‌
హాట్‌సీట్ ( చిల‌క‌లూరి పేట ):  స‌వాల్ చేసి మ‌రీ పుల్లారావును ఓడించిన ర‌జ‌నీ
హాట్‌సీట్ (స‌త్తెన‌ప‌ల్లి ): ' స‌న్‌స్ట్రోక్‌ ' తో కోడెల పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్‌
హాట్‌సీట్ (ఆచంట) : మ‌ంత్రి పితానిని ఓడించింది ఎవ‌రు..
హాట్‌సీట్ (తుని ) : య‌న‌మ‌ల ఫ్యామిలీకి హ్యాట్రిక్ ఓట‌మి
హాట్‌సీట్ ( గుడివాడ ) : ' కొడాలి ' కంచుకోట ప‌దిల‌మే... టీడీపీ చిత్తు చిత్తు
కృష్ణా జిల్లా హాట్ సీట్‌లో వైసీపీ గెలిచింది... ఆ క్యాండెట్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం
హాట్‌సీట్ ప్ర‌త్తిపాడు: ఇద్ద‌రు మంత్రుల‌ను ఓడించిన వైసీపీ జెయింట్ కిల్ల‌ర్‌
హాట్‌సీట్ భీమ‌వ‌రం:  ప‌వ‌న్ ఘోర ప‌రాజ‌యం... గ్రంధికి మంత్రి ప‌ద‌వి
హాట్‌సీట్ పెద్దాపురం:  చిన‌రాజ‌ప్ప ప‌రువు నిలిచింది
నంద‌మూరి అంద‌గాడు... ' ఒక్క మ‌గాడు '
ఏపీ మంత్రి ఖాతాలో ప‌ర‌మ చెత్త రికార్డు
బ్రేకింగ్‌: ఏపీ మంత్రి గెలిచాడోచ్‌
చింత‌మ‌నేనిని త‌రిమికొట్టిన ఓట‌ర్లు.. దెందులూరులో అబ్బ‌య్య అద్భుత విజ‌యం
రేవంత్ గెలుపుతో కేసీఆర్ మైండ్ బ్లాక్‌
ఏం షాక్ బాబూ ఇది.. టీడీపీ మంత్రి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
బ్రేకింగ్‌: టీడీపీలో పెద్ద త‌ల‌కాయ్ ఓట‌మి
బ్రేకింగ్‌: తెలంగాణ‌లో కాంగ్రెస్ బోణి... టీఆర్ఎస్‌కు భారీ షాక్‌
బ్రేకింగ్‌: జ‌గ‌న్‌కు కేసీఆర్ ఫోన్‌... సోద‌రా తెలుగు రాష్ట్రాల‌ను అభివృద్ధి చేద్దాం
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.