జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు.. జగన్ దోచుకున్న సొమ్ముతో అనేక ప్రాజెక్టులు కట్టొచ్చు.. జగన్ లక్షకోట్లు ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోవాలి.. ఇలాంటి అనేక వందల వేల స్టేట్‌మెంట్లు కొన్నేళ్లుగా టీడీపీ నేతలు ఇస్తూ వచ్చారు. 


అసలు ఇంతకీ జగన్ లక్ష కోట్లు తిన్నాడా.. లేదా.. ఈ విషయంపై ఇప్పుడు జగన్ కేసును డీల్ చేసిన జేడీ లక్ష్మీనారాయణే బయటపెట్టారు. సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ జగన్ కేసులపై మాట్లాడారు. జగన్ పై లక్ష కోట్ల అవినీతి అని ఆరోపణలు ప్రచారం చేయడం రాజకీయంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారట.

ఒక టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. తాము ఎక్కడా అభియోగాలలో లక్ష కోట్లు అని చెప్పలేదని, ఎవరైనా రాజకీయం కోసం అలా ప్రచారం చేసుకుంటే తమకు సంబందం లేదని జేడీ క్లారిటీగా చెప్పేశారు. తమకు లభించిన ఎవిడెన్స్ ఆదారంగా కేసులు పెట్టామని ఆయన వివరించారు. 

అసలు ఇంతకీ జగన్ కేసుల్లో అక్రమాల మొత్తం ఎంత ఉంటుందని అడగితే.. మొత్తం మీద 1500 కోట్ల ఆరోపణ ఉండవచ్చని జేడీ అన్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు జేడీ లక్ష్మీనారాయణ నోరు విప్పి జగన్ నెత్తిన పాలు పోశాడన్నమాట. ఇక ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏం చెబుతాయో.. మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: