ప్రధాని నరేంద్రమోడీ నటుడు అక్షయ్ ఖన్నాకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో భలే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలపై మోడీ వివరణ ఇచ్చారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తో మనసువిప్పి మాట్లాడారు.


ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురంచి ప్రస్తావన వచ్చినప్పుడు మోడీ అక్షయ్ కుమార్ కు భలే షాక్ ఇచ్చారు. మోడీ ఏమన్నారంటే..  నేను మీ ట్విటర్‌ ఖాతాతోపాటు మీ భార్య(ట్వింకిల్‌ఖన్నా) ట్విటర్‌ ఖాతాను కూడా చూస్తుంటా. అందులో ఆమె నాపై పలు సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. 

బహుశా ఆమె కోపం అంతా నాపైకి మళ్లింది కనుక మీ ఇంట్లో శాంతి నెలకొని ఉంటుందనుకుంటా. ఇలాంటివి చూసినప్పుడు వాటిని తయారు చేసిన వారికి ఎంతో సృజన, ఆలోచనలు ఉన్నాయని నవ్వుకుంటా.. అంటూ స్పందించారు. అక్షయ్ కుమార్ ట్వీట్ల గురించి మోడీ సరదాగా చెప్పడం ఆకట్టుకుంది. 

అసలు విషయం ఏంటంటే.. ట్వింకిల్ ఖన్నా తరచూ మోడీని విమర్శిస్తూ ట్వీట్లు పెడుతుంటారు. తనపై వచ్చిన విమర్శలను కూడా మోడీ సరదాగా తీసుకున్నారని దీని వల్ల అర్థమవుతోంది. ట్వింకిల్ కూడా దీనిపై స్పందించారు. తన ట్వీట్లను ప్రధాని చదువుతున్నారని దీనివల్ల అర్థమైందన్నారు ట్వింకిల్. 



మరింత సమాచారం తెలుసుకోండి: