మరో కొత్త సర్వే వచ్చింది. న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాలో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. అనంతపురం  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ  అనంతపురం  జిల్లాలో టీడీపీ మొత్తం 12 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం ఈ జిల్లాలో వైసీపీ - టీడీపీ మధ్య హోరా హోరీ పోరు కనిపిస్తోంది. 

అనంతపురం  జిల్లాలో హోరాహోరీ పోరులో వైసీపీదే పై చేయి అయ్యింది.  టీడీపీ ఈసారి గతం కన్నా బాగా తక్కువ సీట్లుసాధిస్తుందట. కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందట. ఇక వైసీపీ 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందట.  జనసేన ఈ జిల్లా ఖాతా తెరిచే ఛాన్స్ లేదట. మరో రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందట.   

రాష్ట్రమంతా ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: