Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 5:03 pm IST

Menu &Sections

Search

న్యాయవ్యవస్థ ప్రతిష్టపై నీలినీడలు-సీజేఐపై లైంగిక ఆరోపణలు-నేడే విచారణ ప్రారంభం

న్యాయవ్యవస్థ ప్రతిష్టపై నీలినీడలు-సీజేఐపై లైంగిక ఆరోపణలు-నేడే విచారణ ప్రారంభం
న్యాయవ్యవస్థ ప్రతిష్టపై నీలినీడలు-సీజేఐపై లైంగిక ఆరోపణలు-నేడే విచారణ ప్రారంభం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆ సేతు శీతాచలం దేశమంతా కలవరం కలిగిస్తుంది. సుప్రీంకోర్టులో 'జూనియర్ కోర్టు అసిస్టెంట్' గా పని చేస్తున్న ఆమె, తాజాగా 22 మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఆరోపణలు చేశారు. 


గత 2018 అక్టోబరు 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి వేధింపులను తిరస్కరించిన దరిమిలా తనను తన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు జడ్జిలను ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది.


దీనిపై రంజన్ గొగోయ్ కూడా స్పందించారు. ఇరవై ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయటాన్ని నమ్మలేకపోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయవ్యవస్థలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అందులో భాగంగానే తనపై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు అని చెప్పారు. తను ఒక ముఖ్య కేసును వచ్చే వారం విచారణ చేయనున్నానని ఇందులో భాగంగానే న్యాయవ్యవస్థను భయపెట్టి తమ కనుగుణంగా న్యాయవ్యవస్థను కొన్ని స్వార్ధపరశక్తులు ప్రయత్నిస్తున్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్ మండిపడ్డారు.


తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయించిన వారి వెనక పెద్దల హస్తం ఉందని ధ్వజమెత్తారు. అంతే కాదు తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని గుర్తుచేశారు. 20 ఏళ్ల సర్వీసు తర్వాత తన బ్యాంకు ఖాతాలో ₹ 6 లక్షలు, పీఎఫ్‌ ఖాతాలో ₹ 40 లక్షలు ఉందని చెప్పిన రంజన్ గొగోయ్ డబ్బు అంశంపై తనను ఎవరూ పట్టుకుని ప్రశ్నించరని. ఇక వేరే కారణం కోసం వెతికి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గొగోయ్ ధ్వజమెత్తారు.


తనను ఎవరూ భయపెట్టలేరని చెప్పిన జస్టిస్ గొగోయ్ తన విధినిర్వహణ విషయంలో ఇసుమంతైనా వెరచేది లేదని చెప్పారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విచారణలో తన జోక్యం ఉండబోదని చెప్పిన గొగోయ్. సీనియర్ జడ్జి అరుణ్ మిశ్రా ధర్మాసనం ఎలాంటి ఆదేశం ఇచ్చినా అందుకు సమ్మతమే అని చెప్పారు. అయితే ఈ కేసు విచారణ చేయాలని చెప్పడంలో తానే బాధ్యత తీసుకున్నట్లు, కేసుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నందున తానే స్వయంగా విచారణకు ఆదేశించి నట్లు జస్టిస్ గొగోయ్ చెప్పారు.

national-news-cji-ranjan-gogoi-justice-nv-ramana-j

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక ఆయన రాజీనామా చేసేలా పెద్ద కుట్ర జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది న్యాయవాది ఉత్సవ్ బైన్స్‌ ను ఆధారాలేమిటో తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని తరఫున వాదించడంతో పాటు ప్రెస్‌క్లబ్‌లో సీజేఐకి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తే తనకు కోటిన్నర రూపాయల ఫీజు చెల్లించేందుకు అజయ్ అనే వ్యక్తి సిద్ధపడ్డాడని ఉత్సవ్ ఒక అఫిడవిట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.


ఈ ఆరోపణలకు ఆధారాలేమిటో తెలుపాలని జస్టిస్ అరుణ్‌ మిశ్రా నేతృత్వ ధర్మాసనంలోని న్యాయమూర్తులు రోయింటన్ ఫలి నారిమన్, దీపక్ గుప్తా తో కూడిన ధర్మాసనం మంగళవారం (23.04.2019) ఆదేశించింది. ఈ కేసు ఎంతో ప్రాముఖ్యమైనదని, న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు సంబంధించినది అని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై బుధవారం (24.04.2019) ఉదయం 10.30 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది.


ఆరోపణల గురించి విన్నప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే ఫిర్యాదిదారు తరఫున వాదించడానికి సిద్ధపడ్డానని ఉత్సవ్ బైన్స్ తన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. మొత్తం ఘటనల క్రమాన్ని, కేసు గురించి అజయ్ అనే వ్యక్తి వివరించినప్పుడు ఎన్నో లోపాలు కనిపించాయన్నారు. ఆ మహిళను కలవాలని చెప్పినా, మధ్యవర్తులు అంగీకరించలేదని, దీంతో తనకు సందేహాలు కలిగాయని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే  50 లక్షల రూపాయలు ఇస్తానని అజయ్ ఆ సాక్షిని ప్రలోభ పెట్టాడు. సాక్షి నిరాకరించడంతో కోటిన్నర రూపాయలకు పెంచాడు అని ఉత్సవ్ బైన్స్ పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో తీర్పులను తారుమారు చేసే దళారులపై సీజేఐ ఉక్కుపాదం మోపినందున, ఆ వర్గాలు ఆయనపై కక్ష గట్టినట్టు ఆ సాక్షికి తెలిపాయని  పేర్కొన్నాయి అని ఉత్సవ్  బైన్స్ తన అఫిడవిట్‌లో వివరించారు. 


చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును తానే విచారణ జరుపడం చట్టపరంగా, నైతికంగా కూడా తప్పేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే పేర్కొన్నారు.

సీజేఐపై సంస్థాగత విచారణ

national-news-cji-ranjan-gogoi-justice-nv-ramana-j

సీజేఐ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే దర్యాప్తు చేయనున్నారు. ఈ దర్యాప్తు సంస్థాగతంగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను పరిశీలించేందుకుగాను సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న తనను సీజేఐ నియమించారని తెలిపారు. మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీతో ఒక కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభిస్తానని చెప్పారు. జస్టిస్ రమణ సీనియారిటీలో తన తరువాతి స్థానంలో ఉన్నారని, మహిళ ప్రాతినిధ్యం కోసం జస్టిస్ బెనర్జీని కమిటీలో తీసుకున్నామని తెలిపారు. 


సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జడ్జీలకు లేఖలు రాయడమే కాకుండా అఫిడవిట్ కూడా దాఖలు చేసిన సదరు మహిళా ఉద్యోగికి నోటీసులు జారీ చేశానని జస్టిస్ బాబ్డే చెప్పారు. సీజేఐపై కుట్ర కేసులో న్యాయ విచారణ జరగాల్సిందే ఏప్రిల్ 26న  (శుక్రవారం) కేసు తొలి  విచారణ ప్రారంభిస్తామని జస్టిస్ ఎస్ఎ బోబ్జే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇంద్రా బెనర్జీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు పత్రాలను సిద్ధం చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ ను ఆదేశించామని తెలిపారు. ఇందులో న్యాయవాదుల పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. తమ దర్యాప్తులో వెల్లడయ్యే  అంశాలను రహస్యంగా ఉంచుతామన్నారు. దర్యాప్తును ముగించడానికి గడువేమీ విధించలేదని పేర్కొన్నారు.


కేసు విచారణ 'ఇన్ హౌస్ ప్రొసీజర్'  ప్రకారం జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరు పార్టీల అడ్వకేట్ల కోసం వేచి చూసే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పింది. ఇది సాధారణ న్యాయ ప్రక్రియ కాదన్న జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ఎంక్వైరీ విధానాన్ని ఫలితాన్ని రహస్యంగా ఉంచుతామని అన్నారు.

national-news-cji-ranjan-gogoi-justice-nv-ramana-j

అయితే విచారణకు ఏర్పాటు చేసిన "అంతర్గత కమిటీ" నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ వైదొలగాలని నిర్ణయించారు. "ఈ విచారణ కమిటీ నుంచి నేను స్వచ్ఛందంగా వైదొలగుతున్నాను. ఈ కమిటీలో సభ్యుడిగా ఉండాలని మీరు కోరారు. అందుకు ఫుల్‌ కోర్టు ఆమోదముద్ర వేసింది. ఇందులో అసాధారణ బాధ్యత ఉంది. అసాధారణ పరిస్థితులుంటే తప్ప ఈ బాధ్యత లను కాదనలేం. కమిటీ నుంచి వైదొలగడానికి నాకున్న కారణాలను ఇక్కడ సంక్షిప్తంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ కమిటీలో నేను సభ్యుడిగా ఉండటం పట్ల ఫిర్యాదుదారు ఏప్రిల్‌ 24న అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన హైకోర్టు భవన శతవసంత వార్షికోత్సవాల సందర్భంగా నేను చేసిన ప్రసంగంలోని కొంత ఎంపిక చేసిన భాగాన్ని ఆధారంగా చేసుకొని ఈ అంశంపై నేను ముందస్తు అభిప్రాయానికి రావొచ్చని ఆమె భావించినట్లు కనిపిస్తోంది. నేను ప్రధాన న్యాయమూర్తికి సన్నిహిత స్నేహితుడినని, వారి కుటుంబసభ్యుడిలాంటి వ్యక్తినని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌పై నిష్పాక్షికమైన విచారణ జరగదేమోనన్న భయాందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ నిజాయతీ, సర్వోన్నత న్యాయస్థానం నిబద్ధతోపాటు ఈ కేసు నిష్పాక్షిక విచారణ గురించి ఆమె చేసిన నిరాధార ఆరోపణలను నేను విస్పష్టంగా ఖండిస్తున్నాను. ఫిర్యాదుదారు వ్యక్తం చేసిన ప్రాతిపదికను ఈ కింది కారణాల రీత్యా పరిగణనలోకి తీసుకోరాదని కోరుతున్నాను"  అని తన లేఖలో పేర్కొన్నారు. 


సిబీఐ డైరెక్టర్, డిల్లీ పోలీస్ కమీషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ను ఈ కేసు ప్రాధాన్యత తీవ్రత దృష్ట్యా సుప్రీం కోర్ట్ అంతర్గత చర్చకు గత బుధవారం పిలవటం జరిగింది. అందులో ఈ      సు-మోటొ కేసులో ఉత్సవ్ బైన్స్ అఫిడవిట్ లో పొందుపరచిన విషయాలను చర్చించారు. 

national-news-cji-ranjan-gogoi-justice-nv-ramana-j

national-news-cji-ranjan-gogoi-justice-nv-ramana-j
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
About the author