వారణాసిలో మోదీపై పోటీ చేస్తానంటూ ఉత్సాహపడిన కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీకి వెనుకంజ వేయడం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైందా.. అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రియాంక పోటీకి తగ్గడం వెనుక చాలా కథ నడిచినట్టు తెలుస్తోంది. 


మోడీపై పోటీకి ముందు ప్రియాంకా గాంధీ సిద్దపడిపోయారు.. తాను పోటీ చేస్తానంటే అన్న వద్దనే అవకాశంలేనది భావించారు. దాంతో మీడియాకు లీకులు ఇవ్వడం ఆ తర్వాత స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడం చేశారు. కానీ ఈ చర్యతో రాహుల్ శిబిరం ఆందోళనలో పడిందట. 

మోడీపై ప్రియాంక గెలిచినా.. ఓడినా.. సంచలనమే అవుతుందని.. పార్టీలో ప్రియాంక పాత్ర పెరుగుతుందని రాహుల్ గాంధీకి నూరిపోశారట. దాంతో ప్రియాంక పోటీకి రాహుల్ నో చెప్పేశారట. చివరకు వారణాసి మోడీపై గతంలో ఓడిపోయిన పాత అభ్యర్థినే బరిలోకి దింపారు. 

ఈ గందరగోళం తర్వాత ప్రియాంక శిబిరానికి చెందిన శ్యాం పిట్రోడా.. ప్రియాంక పోటీకి సిద్ధపడినా రాహుల్ వారించారని ప్రకటన ఇచ్చారు.  దీనికి ఖండన అన్నట్టుగా శుక్లా మరో ప్రకటన ఇచ్చారు. ఈ ఉదంతంతో  కాంగ్రెస్ లోని వర్గరాజకీయాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలు కొత్త  కాకపోయినా.. ఇలా అధిష్టానం స్థాయిలో వర్గపోరు మాత్రం ఇదే తొలిసారి కావచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: