ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుదో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


తాజాగా ఇంటలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. బాగా వైరల్ అవుతున్న ఈ రిపోర్టు ప్రకారం.. వైసీపీ 115 సీట్లు సాధించి అధికారం చేపట్టబోతోందట. టీడీపీ 59, జనసేనకు ఒకటి వస్తాయట. 

కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే.. వైసీపీ ధాటికి మంగళగిరిలో లోకేశ్ మట్టికరవడం ఖాయమట. అలాగే భీమవరంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవడం ఖాయమట. కాకపోత్ పవన్ కల్యాణ్ తన రెండో స్థానం గాజువాకలో మాత్రం గెలుస్తాడట. 

ఇక హిందూపూర్‌లో బాలయ్య టైట్ ఫైట్‌లో ఓటమి అంచుల వరకూ వెళ్లి బొటాబొటి మెజారిటీ బయటపడతారట. మొత్తం మీద జగన్ ధాటికి లోకేశ్‌ తన తొలి ప్రత్యక్ష ఎన్నికలోనే మట్టికరవబోతున్నాడా.. మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో..?

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: