స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ‌తా విలువ‌లు మంట‌క‌లిసి పోతున్నాయి. మ‌న‌దేశంలో బంధాలు, అనుబంధాల‌కు ఎంతో కొంత విలువ‌లు ఉన్నా పాశ్యాత్య దేశాల్లో ఇవి పూర్తిగా నాశ‌నం అయ్యాయి. త‌న భాయ్‌ఫ్రెండ్ చేసిన ప‌నికి అత‌డి మీద ప‌గ‌తీర్చుకునేందుకు ఓ ప్రియురాలు ఏకంగా 20 మందితో శృంగార కేళి న‌డిపింది. కంటిన్యూగా 20 మందితో శృంగారంలో పాల్గొంది. మ‌రి ఈ ప్రియురాలికి అంత కోపం ఎందుకు ? వ‌చ్చిందంటే ఆ ప్రియుడు తాను ఉండ‌గానే మ‌రో అమ్మాయితో శృంగారం చేయ‌డ‌మే.
బ్రిట‌న్‌కు చెందిన ఓ యువ‌తి, యువ‌కుడు మూడు సంవ‌త్స‌రాలుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారు. వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉండ‌డంతో పాటు క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

మూడేళ్లుగా బాగానే సాగిన వీరి డేటింగ్ వ్య‌వ‌హారంలో క‌ల‌త‌లు స్టార్ట్ అయ్యాయి. త‌న భాయ్‌ఫ్రెండ్ మ‌రో అమ్మాయితో సంబంధం పెట్టుకుని త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌న్న విష‌యం ఆ యువ‌తి గ్ర‌హించింది. ఓ రోజు ఆ అమ్మాయితో త‌న భాయ్‌ఫ్రెండ్ శృంగారం చేస్తూ ఆ యువ‌తికి అడ్డంగా బుక్ అయ్యాడు. దీనిని ఆ యువ‌తి త‌ట్టుకోలేక‌పోయింది.


త‌న భాయ్‌ఫ్రెండ్‌కు బుద్ధి చెప్పాల‌ని డిసైడ్ అయ్యింది. ఆ కోపం అణుచుకోలేక వినూత్నంగా ప‌గ తీర్చుకోవాల‌ని తాను ఏకంగా 20మందితో శృంగారం చేసింది. రోజుకో అబ్బాయి చొప్పున శృంగారంలో పాల్గొంటూ ఆమె బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు తనకు తృప్తిగా ఉందని.. తన బాయ్ ఫ్రెండ్ మీద పగ తీరిందని చెప్పింది. ఈ మ్యాట‌ర్ స్థానికంగా హైలెట్ అయ్యి...ఆ త‌ర్వాత ఆ నోటా ఈ నోటా మొత్తం పాకేసింది. ఇప్పుడు ఈ న్యూస్ బ్రిట‌న్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఇదే స్టైల్ రివేంజో అర్థం కావ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: