ఆర్థిక వ్యవహారాల్లో.. ఏ పని కోసం తీసుకున్న నిధులు.. ఆ పని కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక పని కోసం అని చెప్పి.. వేరే పని కోసం రుణాలు తీసుకున్నా అది నేరమే అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న మనదేశపు ఆర్థిక నేరగాళ్లదీ అదే పోకడ. 


తాజాగా మన ఏపీలో వివిధ సంస్థల వద్ద ప్రభుత్వం తీసుకున్న రుణసాయం, ఆర్థిక సాయం మాత్రం చాలావరకూ పక్కదారి పట్టిందట. ప్రభుత్వం ఆ రుణం తీసుకున్న అవసరాలను మరిచి మరీ సంక్షేమ పథకాలకు నగదు సమకూరుస్తోంది. ఇది పరోక్షంగా ఓట్లు కొనుగోలు చేయడమే అన్న విమర్శలు ఉన్నాయి. 

ఇక విషయానికి వస్తే.. ఇక్కడ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు తీసుకున్న ప్రభుత్వం పథకాల కోసం కాకుండా కొత్త సంక్షేమ పథకాలకు కేటాయించారట. ఇలా చేయడం టెక్నికల్ గా తప్పుకాకపోయినా మోరల్‌ గా తప్పుచేసినట్టే. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు నుంచి ఈ మేరకు వెసులుబాటు కల్పించగా.. అదే వెసులుబాటు కోసం మరోసారి ఏపీ సర్కారు లేఖరాయడంతో రిజర్వ్ బ్యాంకు ఈ విషయాలను ప్రస్తావించింది. 

మరి ఇంత భారీ సొమ్ము ఎలా దారి మళ్లింది.. ఎందుకు మళ్లింది.. ఆ మనీ ఆచూకీ ఏంటి. ఇప్పుడు ఏపీ కేవలం రిజర్వ్ బ్యాంకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్టులపై ఎందుకు నడుస్తోంది.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీ ప్రభుత్వం వద్ద నగదు కొరత ఉందా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: