ఎన్నికల క్రతువు ముగిసి 20 రోజులు కావొస్తుంది. పోలింగ్ ముగిసి ఆతరవాత విజయాల ఖాతాలపై అన్నీ పార్టీలు వాటి వాటి లెక్కల్లో తనమునకలై బిజీగా ఉన్నాయి. ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, తామే అధికారంలోకి వస్తామంటూ ఎవరికి వారు ధీమాగా ఢంకా బజాయించి చెపుతున్నారు. ఐతే జనసేన మౌనంగా ఉన్నా కూడా గెలుపు విషయంలో అంతే ధీమాగా ఉంది. జనసేనకు 2 నుంచి 3 కి మించి ఎక్కువ స్థానాలురావని పలు సర్వేలు చెబితే, 14 నుంచి 22 స్థానాలు వస్తాయని మరికొన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. 
Image result for madasu gangadharam, pavan kalyan, janasena flag
తొలి నుంచీ సర్వేలతో తమకు ఎలాంటి పనిలేదని, ఏపీలో జనంలో నిద్రాణంగా జనం సాధారన రాజకీయాల నుండి విముక్తి బలంగా కోరుకుంటున్నారని-నిశ్శబ్ద విప్లవం నిఘూడంగా ఉందని, అందుకే ఎవరూ ఊహించని ఊహకందని ఫలితాలు రాబోతున్నాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. నిన్న సోమవారం కాకినాడలో "కాకినాడ పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం" సమావేశానికి హాజరైన పార్టీ నేతలు ఏపీలో పోలింగ్ సరళి గురించి లోతుగా చర్చించారు. పోలింగ్ రోజు తమకు ఎదురైన అనుభవాలను ఒకరితో మరొకరు ఆ చర్చల్లో పంచుకున్నారు. రాష్ట్రాధికారం చేపట్టడానికి బీఎస్పీకి 25 ఏళ్లు పడితే, జనసేనకు మాత్రం ఐదేళ్లే పడుతోందన్నారు సీనియర్ నేత మాదాసు గంగాధరం.
Related image
సర్వేల్లో ఆ పార్టీ, ఈ పార్టీ విజయం సాధిస్తుందని అని చెబుతున్నారు. తమకు సర్వేలతో పనిలేదు. జనసేన పార్టీకి ప్రజాసేవే ముఖ్యం. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉంది. ఎవరూ ఊహించని విధంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. రాజ్యాధికారం అందని అనేక కులాలు, వర్గాలను అందలం ఎక్కించాలని పవన్ కృషి చేస్తున్నారు. జనసైనికులు అంటే పవన్‌ కళ్యాణ్‌కు ప్రాణం, వారు వెనుక ఉన్నారన్న నమ్మకంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారు. అని — మాదాసు గంగాధరం, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ బలంగా చెపుతు వస్త్న్నారు.
Image result for madasu gangadharam, pavan kalyan, janasena flag
సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారి తుఫాన్‌ గా తీరం దాటి తన ప్రతాపం చూపిస్తుంది. అలాగే 2014 లో జనసేన అల్పపీడనంలా ఏర్పడి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వాయుగుండంలా మారి తుఫాన్‌ గా విరుచుకుపడింది. ఇప్పుడు ఆ తుఫాన్ తాకిడికి ఏయే పార్టీలు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని, పవన్ కళ్యాన్ నిబద్ధత, నిజాయతీ కారణంగా ప్రత్యర్ధి పార్టీలకు నిద్రపట్టడం లేదని, జనసేన ప్రభంజనం ఎలా ఉంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారని  హరి ప్రసాద్ అంటున్నారు. 
Image result for madasu gangadharam, pavan kalyan, janasena flag
ఎన్నికల్లో గెలుపోటములను పక్కనబెడితే, తక్కువ సమయంలో జనసైనికులు చేసిన పోరాటం అద్భుతమని నేతలు కొనియాడారు. ఆ పోరాట ఫలితంగా రాష్ట్రంలో ఎవరూ ఊహించని  ఫలితాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, జనసేన సత్తాను క్షేత్ర స్థాయి నుండి మరోసారి చాటాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు జనసేన నేతలు.

Image result for madasu gangadharam, pavan kalyan, janasena flag

మరింత సమాచారం తెలుసుకోండి: