ఏపీలో మెజార్టీ స‌ర్వేలు ఇప్ప‌టికే వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని లెక్క‌లు క‌డుతున్నాయి. ప్రాంతాల వారీగా అందుతోన్న స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ తీసేది గ్రేటర్ రాయలసీమ, సెమీ సీమ ప్రాంతాలే  (ప్ర‌కాశం + నెల్లూరు జిల్లాల ప్రాంతం) అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గినప్పుడే రాయలసీమ పరిధిలోని ఆ పార్టీకి వచ్చిన సీట్లు అంతంత మాత్రం. ఒక్క అనంత‌పురం జిల్లా మిన‌హా మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా ఉంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఒక్క‌టే సీటు గెలిచింది. క‌ర్నూలులో మూడు... చిత్తూరులో 6 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. అనంత‌పురంలో మాత్రం 12 సీట్లు వ‌చ్చాయి. 


ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలిచిన మూడు సీట్లు అతి స్వ‌ల్ప మెజార్టీతో గెలిచిన‌వే. ప్ర‌కాశం జిల్లాలో 5 సీట్లు సాధించింది. ఈ సారి ఈ ఆరు జిల్లాల్లో టీడీపీ ఘోరంగా దెబ్బ‌తింటోంది. సీమ‌లో టీడీపీ కంచుకోట అనంత‌లోనూ ఆ పార్టీ మ‌హా అయితే 4 సీట్లు సాధిస్తుంద‌ని కూడా అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు. అప్పుడు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు నాయుడు విఫలం కావడం - రైతు రుణమాఫీ - డ్వాక్రా రుణమాఫీ చేయ‌క‌పోవ‌డం.. ఇక ఈ జిల్లాలో బ‌లంగా ఉన్న బీసీల‌కు జగ‌న్
ఇక ఈ జిల్లాలో బ‌లంగా ఉన్న బీసీల‌కు


ఇక ఈ ఎన్నిక‌లు జ‌రిగిన తీరు ప‌రిశీలిస్తే రెండు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెర‌వ‌డం కూడా క‌ష్టంగానే ఉంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఒకే ఒక సీటుకు ప‌రిమితం అవుతోంది. ఈ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఆ జిల్లాలో కేవ‌లం జ‌మ్మ‌ల‌మ‌డుగు మీద మాత్ర‌మే కాస్తో కూస్తో ఆశ‌లు పెట్టుకుంది. దీనిని బ‌ట్టి ఈ జిల్లాలో వైసీపీ ముందు టీడీపీ చిత్తు చిత్తు అయిపోతుంద‌న్న విష‌యం క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఈ సారి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఖాతా తెరిస్తే చాలా గొప్ప అన్న‌ట్లుగా ఉంది. జిల్లాలో పోటీ చేసిన ఇద్ద‌రు మంత్రులు పి.నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి లాంటి వాళ్లు సైతం ఎదురీదుతున్నారు.


ఇక ఈ జిల్లాల‌తో పాటు ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేదు. ఈ జిల్లాలో కొంత‌లో కొంత న‌యం ఏంటంటే బాప‌ట్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఛాన్సులు ఉన్నాయి. ఆ రెండు సీట్లు ప‌క్క‌న పెడితే అక్క‌డ కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఒంగోలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వైసీపీ జోరు ముందు టీడీపీ బేజారు అయ్యింది. ఇక అనంత‌పురం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 12 సీట్లు గెలిస్తే ఈ సారి 4కు ప‌రిమితం అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక క‌ర్నూలులో టీడీపీ 3-4 కు మించి సీట్లు గెలిచే ప‌రిస్థితి లేదు. ఏదేమైనా ఈ సారి సీమ దెబ్బ‌తోనే బాబుకు షాక్‌లు మామూలుగా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: