ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై ఎప్పటి కప్పుడు ట్వీట్లతో విరుచుకుపడే వైసిపి నేతల్లో సీనియర్ అయిన విజయసాయి రెడ్డి, తాజాగా చంద్రబాబు గుఱివింద తన కింద నలుపెరగ కుండా చెప్పె శ్రీరంగనీతులకు సరిగ్గా కౌంటర్ ఇచ్చేశారు. అసలు చంద్రబాబుపై విమర్శ చేసే చిన్న అవకాశాన్ని వదిలి పెట్టని రెడ్డి టీట్లలో ఎలాంటి మొహమాటం ఉండదు. అయ్యో! వృద్ధ రాజకీయ నాయకుడే! పోనీలే! అన్న కనికరమూ కూసింత కూడా ఉండదు.
Image result for chandrababu naidu kothala rayudu
ఎంత నిజమైనా అంత నిర్దయగా నాలుగు దశాబ్ధాలు అనుభవమున్న చంద్రబాబును కడిగిపారేయటం "వెరీ...బాడ్ ఆన్ విజయసాయిరెడ్డిస్ పార్ట్" కొంచెం దయతో కాస్త డోస్ తగ్గించి ట్వీటితే బాగుంటుందేమో? కాస్త ఆలోచించండి సర్!  

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనకు టచ్ లో ఉన్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్యపై చంద్రబాబు షివరవుతూ గందరగోళం అవుతూ పెట్టిన ట్వీట్లపై విజయ సాయిరెడ్డి చెలరేగిపోయారు.  ఈ సందర్భంగా ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిన విజయ సాయి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి బాబు! అంటూ ఫైర్ అయి, "అక్కడెక్కడో బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాటకు, అమరావతిలో చంద్రబాబు పళ్లు నూరటమేమిటి?" అంటూ పళ్ళు కొరుక్కుంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమ్మెత్తి పోశారు.
Image result for chandrababu naidu kothala rayudu
మండే ఎండల్లో మరింత మంట పుట్టేలా ఉన్న విజయసాయిరెడ్డి ట్వీట్లను యథాతధంగా చూస్తే, చంద్రబాబు చేసిన పాపాల చిట్టా వెండితెరపై సినిమా స్కోప్ సిన్మా లాగా కనిపిస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ మాటలకు మద్దతు పలుకుతున్నట్లుగా అనిపించినా, అందులో చంద్రబాబు కోణం అద్భుతంగా మాగ్నిఫై అయిందని చెప్పాలి. ఇంతకీ, విజయసాయిరెడ్డి చేసిన ఘాటు ట్వీట్లు ఒకే చోట క్రోడీకరించి చూస్తే: 

Image result for chandrababu frustration on LV subrahmanyam

1 మా వైసిపి ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతక నీతులు ఏమయ్యాయి చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్-లో ఉన్నారని ఎక్కడో ప్రధాని నరేంద్ర మోడీ అంటే అమరావతిలో కూర్చుని పళ్లునూరటం లోని ఔచిత్యమేమిటి? ఇలాంటి దుష్కార్యాన్ని, దుర్మార్గాన్ని చూసి వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ మీ ఇంటి పెద్ద పాలేరులా అడ్డుపడిన దాంట్లోమి నైతికత గుర్తుకు అప్పుడు రాలేదెందుకో?

Image result for horse trade of 23 MLAs in AP by chandrababu

2 చివరాఖరున చంద్రబాబు చేసిన మరో అత్యంత ధారుణ తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ధూషించడం. ఓటమి దగ్గర పడిందన్న ఫ్రస్టేషన్ లో రాష్ట్ర ఉన్నతాధికారి అన్న విఙ్జత మరచి ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకల చిత్రగుప్తుని చిట్ఠా రేపు అధికారం కోల్పోయిన తరవాత కూడా చంద్రబాబును వెంటాడతాయి.

Image result for chandrababu frustration on LV subrahmanyam

3 దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక "బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్" ను - డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువుల మార్కెటింగుకు వాల్-వార్ట్ ను ఒప్పించానని, మన కొబ్బరి నీళ్లను పెప్సీ  'కో-బ్రాండింగ్' తో అమ్ము తుందని కోతలు కోశారీ కోతల రాయుడు. బోయింగ్ విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా? అందుకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కోతల రాయుడుగా మిగిలిపోబోతున్నారు. 

Image result for chandrababu naidu kothala rayudu

4 టిడిపి నాయకులు అపద్ధర్మ ప్రభుత్వంలో కూడా వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. "నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ" విధించినా, సిగ్గు లేకుండా ఇసుక - మట్టి తరలిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుకపైనే నెలకు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అందుకు సిఎస్ తక్షణం అవినీతి పరులపై కొరడా ఝళిపించాలి ఇలాంటి ప్రకృతి వనరుల దోపిడీ గాళ్లపై వెంటనే కేసులు నమోదు చేయించాలి.

Image result for NGT penalty on AP

మరింత సమాచారం తెలుసుకోండి: