రాష్ట్రంలో  ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి కళ్లూ ఫలితాలపైనే ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుందని అంచనాల లెక్కలు తెగ వేసకుంటున్నారు. ఏ పార్టీ వస్తుందనే దానితోపాటు.. కీలక వ్యక్తుల సంగతేంటన్న చర్చ కూడా సాగుతోంది. 


ఇక వీఐపీల విషయానికి వస్తే.. చంద్రబాబు, జగన్ ఎలాగూ వారి వారి స్థానాల్లో గెలుస్తారు. అందులో ఎవరికీ అనుమానాల్లేవు. ఇక మరో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంగతేంటన్నది ఆసక్తికరంగా ఉంది. తాజాగా విడుదలై సీపీఎస్ సర్వే ప్రకారం.. పవన్ కల్యాణ్ గాజువాకలో గట్టిపోటీ ఎదుర్కుంటున్నారట. 

గాజువాకలో గట్టి పోటీ మధ్య పవన్ గెలిస్తే గెలవచ్చు.. కానీ గ్యారంటీగా చెప్పలేమంటున్నారు. అలాగే ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం భీమవరంలోకూడా హోరాహోరీ పోరాటం ఉందట. ఈ రెండుచోట్ల పవన్ భవితవ్యం ఏంటో ఈ సర్వే కూడా చెప్పలేకపోయింది. టైట్ ఫైట్ అని మాత్రం చెప్పగలిగారు. 

ఇక మరో కీలక స్థానం మంగళగిరి.. ఇక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేశ్‌కు పరాజయం తప్పదని సీపీఎస్ సర్వే చెబుతోంది. ఇక్కడ వైసీపీ గెలుస్తుందట. 

ఇక మరో వీఐపీ నందమూరి బాలకృష్ణ. ఆయన హిందూపూర్ నుంచి రెండోసారి బరిలో దిగారు. ఆయన వరుసగా రెండోసారి కూడా జయకేతనం ఎగరేస్తారట. రాప్తాడులో పరిటార రవి కొడుకు శ్రీరామ్‌కూ ఓటమి తప్పదట. ఇదీ సీపీఎస్ సర్వే అంచనాలు. ఎంతవరకూ నిజమవుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: