సెంటిమెంట్‌కు లాజిక్ ఉండదు.. లాజిక్‌ కు సెంటిమెంట్ ఉండదు.. కానీ కొన్ని మాత్రం భలేగా లాజిక్‌తో కూడి సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇది కేవలం ఓ గమనింపు, పరిశీలన మాత్రమే అంతకు మించి సీరియస్ గా  తీసుకోకండి సుమా. 


విషయం ఏంటంటే..  కాంగ్రెస్ రాజకీయంలో ఒక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. అదేమిటంటే, ఇప్పటివరకూ ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి జీవించి ఉన్నంత కాలం ఇంకొక ప్రధానమంత్రి కాంగ్రెస్ నుండి ఎన్నిక కాలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. 

మొదటి నుంచీ వద్దాం.. మొదటి ప్రధాని నెహ్రూ చనిపోయిన తర్వాతే లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. శాస్త్రీజీ మరణం తర్వాతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాతనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. 

ఇక రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాతే పి.వీ.నరసింహారావు ప్రధానమంత్రి అయిన విషయం అందరికి తెలుసు. ఆ తర్వాత పీ.వీ.నరసింహరావు బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్ అధికారంలోకి రానేలేదు. ఎప్పుడు 2004 లో నరసింహారావు చనిపోయారో ఆ సంవత్సరమే మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.

ఇప్పటివరకూ ఉన్న లాజిక్ ప్రకారం ఎంతవరకు మన్మోహన్ సింగ్ జీవించి ఉంటారో అంతవరకు కాంగ్రెస్సు అధికారంలోకి రాదన్నది ఒక వాదన. అంతవరకు కాంగ్రెస్ నుంచి ఎవ్వరూ ప్రధాన మంత్రి కాలేరన్నది ఈ విశ్వాసం. మరి ఈ లాజిక్ కొనసాగుతుందా.. బ్రేక్ అవుతుందా చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: