ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో సర్వే వెలుగు చూసింది. ఇప్పటి వరకూ ఎక్కువగా టీడీపీ, వైసీపీ సర్వేలో ఎక్కువగా వచ్చాయి. తాజాగా జనసేనపై కూడా  ఓ సర్వే వచ్చింది. ఏపీ న్యూస్ యూట్యూబ్‌లో విడుదలైన ఈ సర్వే.. నిజం కాకపోతే.. ఛానల్ మూసేస్తామని సవాల్ విసరడం విశషం. 


ఈ ఛానల్ నిర్వాహకుడు గతంలో జయప్రకాశ్ నారాయణ వద్ద ఐటీ విభాగంలో  పనిచేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆయన లెక్క ప్రకారం జనసేన పార్టీ కచ్చితంగా 53 స్థానాల్లో గెలుస్తుందట. 

అవేమిటంటే.. పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో పది స్థానాలు జనసేన గెలుచుకుంటుందట. తూర్పు గోదావరి జిల్లాలో 14 స్థానాలు, విశాఖపట్నం జిల్లాలో పది స్థానాలు, గుంటూరు జిల్లాలో -  5 స్థానాలు, కృష్ణా జిల్లా - 5 స్థానాలు గెలుస్తుందట. 

ఇవి కాకుండా... విజయనగరం జిల్లా నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ప్రకాశం జిల్లా గిద్దలూరు, నెల్లూరు జిల్లా కావలి, కర్నూలు జిల్లా నంద్యాల, చిత్తూరు జిల్లా పుంగనూరు, అనంతపురంజిల్లాలో అనంతపురం అర్బన్,గుంతకల్లు కూడా జనసేన గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: