టీవీ9.. తెలుగులో న్యూస్ కు క్రేజ్‌.. రిపోర్టింగ్‌ కు పేరు తీసుకొచ్చిన ఛానల్.. వినూత్నమైన ప్రజంటేషన్‌తో అప్పటివరకూ ఉన్న రూల్స్ బ్రేక్ చేస్తూ దూసుకొచ్చేసి దాదాపు పదిహేనేళ్లు దాటిపోయింది. ఈ ఛానల్ ఇంతగా పాపులర్ అయ్యిందటంటే.. అందుకు సీఈవో రవిప్రకాశ్ వేసిన పునాదులే కారణం..


ఛానల్ ఆరంభంలో ఆయన చేసిన షోలు.. సంచలనం సృష్టించాయి. అలాగే టీవీ9 పై ఎన్నో విమర్శలూ వచ్చాయి.. సంచలనాల కోసం, రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారన్న అపవాదులూ మూటగట్టుకున్నారు. ఏదేమైనా టీవీ9 అంటే రవిప్రకాశ్‌.. రవిప్రకాశ్ అంటే టీవీ9.
కానీ ఇటీవల టీవీ9 నుంచి రవిప్రకాశ్ బయటకు వచ్చేస్తున్నారనే టాక్ మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. ఇటీవల టీవీ9 గ్రూప్ ను దాని యజమాని శ్రీనిరాజు.. మైహోమ్‌ గ్రూప్‌ కు అమ్మేసిన సంగతి తెలిసిందే. కానీ.. అందులో కొన్ని షేర్లు టీవీ9 ప్రకాశ్‌ తోపాటు మరికొందరికి ఉన్నాయట. కానీ ఇవి చాలా తక్కువ షేర్లు. 


అందువల్ల కొత్తగా వచ్చిన గ్రూపు డైరెక్టర్లు.. తరచూ టీవీ9 వార్తల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో వార్తల విషయంలో చాలా స్వేచ్ఛ ఉండేదని.. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అన్నింటిలో వేలుపెడుతున్నారని రవిప్రకాశ్ చాలా అసహనంతో ఉన్నారట. ఆయన ఎందుకైనా మంచిదన్న ఆలోచనతోనే మోజో ఛానల్‌ కూడా ప్రారంభించారు.


రవిప్రకాశ్ ను బయటకు పంపించేందుకు కొత్త  యాజమాన్యం జోరుగా ప్రయత్నాలు చేస్తోందని టాక్. అందుకే రవిప్రకాశ్ కూడా త్వరలోనే బయటకు వచ్చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి రవిప్రకాశ్ లేని 'TV9 ఏ స్థాయిలో రాణిస్తుందో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: