ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు భీమవరం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాలు రెండూ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా హాట్ నియోజ‌క‌వ‌ర్గాలుగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇక్క‌డ నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తొలిసారి ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డ‌మే. చంద్ర‌బాబు కుప్పంలో, జ‌గ‌న్ పులివెందుల‌లో పోటీ చేసినా ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు వారిద్ద‌రికి కంచుకోట‌లు. వారు గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భారీ మెజార్టీల‌తో ఘ‌న‌విజ‌యాలు సాధించారు.


ఇక ప‌వ‌న్ ఈ ఎన్నిక‌ల్లోనే తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో పాటు రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌డంతో ప‌వ‌న్ ప‌రిస్థితి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలా ?  ఉంటుందా ? అన్న ఆస‌క్తి కేవ‌లం జ‌న‌సేన వ‌ర్గాలకే కాకుండా ప్ర‌తి ఒక్క స‌గ‌టు ఓట‌రులోనూ ఉంది. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు మ‌రో 20 రోజుల టైం ఉండ‌డంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు, ఓట‌ముల‌పై జ‌న‌సేన వ‌ర్గాలు సైతం ఇప్ప‌టికే స‌మీక్ష‌లు నిర్వ‌హించుకున్నాయి. జ‌న‌సేన ఇన్న‌ర్ స‌మీక్ష‌ల్లో గాజువాక‌లో ప‌వ‌న్ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తాడ‌ని తేలింద‌ట‌. 


గాజువాక‌లో జ‌న‌సేన వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం 30 వేల పైన మెజార్టీతో జ‌న‌సేన విజ‌యం సాధించ‌బోతోంద‌ని తేలింద‌ట‌. ఇక్క ముందుగా టీడీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నా... చివ‌ర‌కు వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింద‌ని జ‌న‌సేన లెక్క‌లు వేసుకుంది. ఇక ప‌వ‌న్ పోటీ చేసిన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ తరపు నుంచి గ్రంధి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.దీనితో అక్కడ పవన్ గెలుపు ఏమంత సులువు కాదని అక్కడి ప్రజల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన గ్రంధికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి సానుభూతి ఉంది.


2004లో ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధికి 15 ఏళ్ల త‌ర్వాత ఎమ్మెల్యే సీటు వ‌చ్చింది. అక్క‌డ టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండుసార్లూ గెలుస్తూ వ‌స్తోన్న పుల‌ప‌ర్తి అంజిబాబు పోటీ చేశారు. జ‌న‌సేన వ‌ర్గాల ఇన్న‌ర్ అంచ‌నాలు, స‌మీక్ష‌ల ప్ర‌కారం అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురిలోను కేవలం పవన్ మరియు శ్రీనివాస్ ల మధ్య మాత్రమే గట్టి పోరు ఉండనుంది. గాజువాక‌లో గెలుస్తామ‌ని లెక్క‌లు వేసుకుంటోన్న భీమ‌వ‌రం విష‌యంలో మాత్రం కాస్త డిఫెన్స్‌తోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.


ముందు నుంచి గాజువాక మీద గెలుపుతో ఉన్న జ‌న‌సేన వ‌ర్గాలు చివ‌ర్లో భీమ‌వ‌రంలో ఓటుకు రూ.1000 నుంచి రూ.1500 డ‌బ్బులు పంచేందుకు కూడా వెనుకాడ‌లేదు. ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉండే మ‌రో సామాజిక‌వ‌ర్గంతో చేతులు క‌లిపి అక్క‌డ ప‌వ‌న్‌ను గెలిపించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా అక్క‌డ వైసీపీకి ఎడ్జ్ ఉంద‌ని చాలా మంది చెపుతున్నారు. ఏదేమైనా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అంచ‌నాలు ఎలా ?  ఉన్నా తుది ఫ‌లితాల కోసం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: