ఆకలి చావులు మనకు కొత్త కాదు.. కానీ ఈ చావు మరీ దారుణమైంది.. తినేందుకు అన్నం లేక.. రోజుల తరబడి ఆకలిబాధ తట్టుకోలేక.. ఓ చిన్నారి మట్టితో కడుపు నింపుకుంది. చివరకు ఆ మట్టి తిని అనారోగ్యం పాలై మట్టిలో కలసిపోయింది. 


అనంతపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది.  కర్ణాటక నుంచి వలస వచ్చిన మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో స్థిరపడ్డారు. కూలినాలి చేసుకునే వీరికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. ఐదుగురు సంతానం. రెండేళ్ల వయసున్న పాప ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై  మృతి చెందింది. 

ఎంత దారుణమైన ఘటన.. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మనది.. పారదర్శక పాలన మనది.. 80 శాతం సంతృప్త స్థాయి ఉంది ప్రజల్లో.. ఎక్కడ ఏం జరుగుతున్నా డ్యాష్ బోర్డులో చూసేస్తాం.. అంటూ సాగిన పాలనలో ఇంత దారుణమైన సంఘటనా.. ఇంకా ఎందుకు మనకు ఈ కీర్తికిరీటాలు..

కేంద్రం నుంచి వచ్చిన 600గా అవార్డులు చెత్తబుట్టలో వేసేందుకా... ఆకలితో అలమటించే చిన్నారికి నాలుగు మెతుకులు పెట్టలేని దౌర్భాగ్యం ఎవరిది..? ఇలాంటి ఆకలిచావుల ప్రపంచంలో ఉన్నందుకు సామూహికంగా సిగ్గుపడదాం. తోటి వారి పరిస్థితి ఆలోచించలేని అమానవీయ లోకంలో ఉన్నందుకు సిగ్గుపడదాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: