ప్రపంచాన్ని ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తుంది.  సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ డ్రగ్స్ బారినపడితే జీవితాలు నాశనం అవుతున్నాయి.  డబ్బు సంపాదించడంమే పరమావధిగా పెట్టుకున్న కొంత మంది దుర్మార్గులు ఎదుటి వారి ప్రాణాల గురించి ఏమీ ఆలోచించకుండా ఈ డ్రగ్స్ మత్తులో ముంచుతున్నారు.   ఆ మద్య హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.  ఇందులో కళాశాల విద్యార్థులు, రాజకీయ, సినీ తారలు కూడా ఉన్నారని తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.  


తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.  హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టును రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 28 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఈ డ్రగ్స్ వ్యాపారులు  గతంలో డీజే గాను, పబ్ లలో  పనిచేసిన వ్యక్తులు గత ఏడాది కాలంగా డ్రగ్స్ అమ్మకాలలో ప్రముఖుడైన ఉస్మాద్, సమద్ లతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించారని  హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్  చెప్పారు.  


ముంబాయి రెంది ఇషాక్ అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకు వస్తే..ఇక్కడ ఉన్నవారు యూత్  కి అలవాటు చేసి అమ్మేవారని ఆయన వివరించారు. విశ్వసనీయ సమాచారంతో  సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకున్నారని ఆయన చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: