ఏదైనా యూనివర్శిటీలో వీసీ కీలకపాత్ర పోషిస్తారు.. ఆ తర్వాత రెక్టార్ కు అంత పవర్ ఉంటుంది. కానీ ఎస్వీ యూనివర్శిటీ తీరే వేరు. ఇక్కడ అంత కంటే చిన్న స్థాయి లేడీ ఉద్యోగి అన్నింటిలోనూ చక్రం తిప్పుతున్నారు. పలుకుబడి అడ్డంపెట్టుకున్న ఈ లేడీ బాస్ అరాచక శక్తిగా మారారు. 


యూనివర్శిటీలో ఆమె మాటకు ఎదురులేదు.  వీసీ అయినా, రెక్టారైనా, ఇంకెవరైనా ఆమె తర్వాతే. ఆమె ఓ లేడీ సీతయ్య.. ఆమె ఎవరి మాటా వినరు.. అంతా ఆమె మాట వినాల్సిందే. బలహీన వర్గాల వారంటే ఆమెకు ప్రత్యేకమైన చిన్న చూపు. అలాంటి వారిని దగ్గరకు కూడా రానీయరామె. 



అమరావతి స్థాయిలో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. పలుకుబడి ఉంది. ఆ పలుకుబడే పెట్టుబడి ఆమె యూనివర్శిటీలో నియంతగా మారారు. ఆమెకంటే సీనియర్లు, విద్యాధికులు, అర్హులు ఉన్నా ఆ పదవిలోకి నేరుగా వచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట. 


ఆమెకు ఇష్టం లేకపోతే ఎస్వీయూనివర్శిటీలో ఏ పనీ జరగదు. వీసీల నిర్ణయాలను సైతం హోల్డ్ లో పెట్టగల సమర్థురాలీ లేడీ బాస్. ఆమె పెండింగ్‌లో పెట్టిన ఓ ఫైల్ విషయం చివరకు ఎస్‌సి, ఎస్టీ కమిషన్‌ దాకా వెళ్లిందంటే ఆమె కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఇన్‌ఛార్జ్ వీసీ అవ్వడం నచ్చని ఆమె.. అతని ఫోటోను... వీసీల బోర్డులో అతని పేరునూ పట్టుబట్టి తీయించిన ఘటికురాలామె. 



ఆమె ప్రస్తుతం ఉన్న పదవికి అర్హురాలు కాదంటూ ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి. ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అదంత ఈసీ కాదు. ఇక విసి ఉన్నా ఆయన నిమిత్త మాత్రుడే. ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ వ్యవహారాల్లో ఆమె కుటుంబ సభ్యులు  కూడా జోక్యం చేసుకుంటున్నారు. మరి ఇంకా ఈ లేడీ బాస్ చేతిలో ఎన్ని అరాచకాలు జరుగుతాయో. 



మరింత సమాచారం తెలుసుకోండి: