ఒక సీఎం హోదాలో ఉండి సత్తార్‌ మార్కెట్, మట్కాలను ప్రోత్సహించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల చంద్రబాబు టెలీకాన్ఫరెన్సులో చేసిన వ్యాఖ్యల ఆడియోను మీడియా సమావేశంలో  వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వినిపించారు. ఈ వీడియో ద్వారా చంద్రబాబు  గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోందని ఆయన విమర్శించారు. 


ముఖ్యమంత్రిగా ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన ఇటువంటి వ్యక్తి ఉంటే భవిష్యత్‌పై ఆందోళన కలుగుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవం ఏమయ్యిందని ప్రశ్నించారు. పదవికాంక్ష, పార్టీలో అధ్యక్ష పదవిని కాపాడుకోవడానికి దేనికైనా దిగజారడానికి  సిద్ధమని చంద్రబాబు ఒక మెసెజ్‌ ఇచ్చారన్నారు. చీకటికోణంలో ఉన్న వాళ్లు తమకు సహకారం అందిస్తున్నారని, మాఫియా మా వెనుక ఉందనే సందేశం చంద్రబాబు ఇచ్చారని.. ఎందుకు చంద్రబాబుపైన కేసు పెట్టకూడదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 

చంద్రబాబును దుర్మార్గపు ముఖ్యమంత్రిగా అభివర్ణించిన శ్రీకాంత్ రెడ్డి... ప్రజలపై చంద్రబాబుకు నమ్మకం లేదని.. తను ఓడిపోతానని తెలిపి గ్రౌండ్‌ పిపేర్‌ చేస్తున్నారన్నారు. తెలుగుదేశంలో పార్టీలో ఒక ముసలం ఏర్పడిందని, పార్టీలో చంద్రబాబును భరించలేమని కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారన్నారు. 

గతంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై  కక్ష  తీర్చుకోవడానికి కిక్రెట్‌ బెట్టింగ్‌ చేశారని చెప్పి నెల్లూరు ఎమ్మెల్యేను నానారకాలుగా  వేధించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. చేయని నేరానికి ఇరిక్కించాలని ప్రయత్నాలు చేశారన్నారు. సీఎస్‌ తన వాడు అయితే మంచివాడు..తన వాడు కానప్పుడు వేరే సీఎస్‌ వస్తే..అతడు పనికిరాడు..రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యనిస్తారని మండిపడ్డారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు ఆరు నెలల క్రితమే పసిగట్టారని ఓడిపోతామనే ఈవీఎంలపై నెపం నెట్టారని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: