ఒక కుంభకోణం తోక కనిపించింది అలా వెతుకుతూ పోతే, దాని తల దొరికింది, దాని యజమాని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అని తేలింది. ఆయన పౌరసత్వ అంశంపై బిజేపి నాయకుడు సుబ్రమణ్యస్వామి చేసిన పిర్యాదు తోక కాగా - పరిశొధన లో బ్యాకప్‌ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ అనే కంపనీ అసలు సిసలు తలగా దొరికింది. 
Image result for rahul behind ₹20000 crore scam - Ulrik mcknight rahul gandhi partner
రాహుల్ గాంధి పౌరసత్వ అంశంపై-కాంగ్రెస్, బీజేపీలు ఒక దానిపై మరొకటి విమర్శలు రచ్చలు రాగ్ధాంతాలు చేసుకుంటున్న సమయంలో, రాహుల్‌ గాంధి గతంలో బ్రిటన్‌ లో ఉల్రిక్‌ మెక్‌నైట్‌ అనే వ్యక్తి భాగస్వామిగా "బ్యాకప్‌ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌" అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. దాని చరిత్రపై పరిశోధన జరిపితే "బ్యాకప్‌ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌" పేరుతో రాహుల్‌ గాంధీ 2003లో బ్రిటన్‌లో ఒక సంస్థను నెలకొల్పారు. యూపీఏ హయాంలో నావల్‌ గ్రూప్‌ విదేశీ భాగస్వామిగా రాహుల్‌ గాంధి మాజీ వ్యాపారభాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు "ఇండియా టుడే' కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్‌ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం, రాహుల్ గాంధి, ఉల్రిక్ మెక్‌నైట్‌లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు.
Image result for french naval group
ఈ కంపనీ ఉనికి నిజమే అనటానికి ఋజువు  2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో బ్యాకాప్స్‌ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్‌ గాంధి పొందు పరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది. ఉల్రిక్‌ మెక్‌నైట్‌ అనే అమెరికన్‌తో కలిసి ఆయన పెట్టిన ఈ కంపెనీ విన్‌చెస్టర్‌లో ఉంది. కంపెనీ మూతపడటానికి ముందు 'బ్యాకాప్స్‌' లో రాహుల్‌ గాంధి, ఉల్రిక్‌ మెక్‌నైట్‌ వాటాల నిష్పత్తి 65:35 గా ఉంది. ఈ కంపెనీ వెబ్‌-సైట్లో రాహుల్‌ గంధి (రాహుల్ వించిగా చూపారు) పేరు ఎదుట బ్రిటిష్‌ జాతీయుడు అని ఉంది. నెంబర్‌ 2, ఫ్రాగ్నల్‌ వే, లండన్‌, ఎన్‌డబ్ల్యూ 3, 6ఎక్స్‌ఈ అనేది రాహుల్‌ చిరునామాగా పేర్కొన్నారు. ఈ కంపెనీ గురించి రాహుల్‌ తన 2004 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
Image result for rahul vinci passport by subramanya swamy
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సంబంధం ఉన్న 'బ్యాకప్‌ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌' పై ఆరా తీస్తుంటే అనూహ్యంగా ఒక వివాదం వెలుగు చూసింది. యూపీఏ హయాం లో ఆయన ఒక రక్షణరంగ ఒప్పందంలో తెర వెనుక పాత్ర పోషించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ₹ 20000 కోట్ల  స్కార్పియన్‌ జలాంతర్గాముల విడిభాగాల తయారీ మరియు సరపరా ఒప్పందం లో రాహుల్‌ మాజీ వ్యాపార భాగస్వామి ఉల్రిక్‌ మెక్‌నైట్‌ లాభపడ్డాడనేది ఆరోపణ. 
Image result for rahul vinci passport by subramanya swamy
ఆ కాంట్రాక్టును చేజిక్కించుకున్న ఫ్రెంచ్‌ కంపెనీ ‘నేవల్‌ గ్రూప్‌’ నుంచి ఆఫ్‌-సెట్‌ కాంట్రాక్ట్‌ పొందిన సంస్థలో  రాహుల్‌ గాంధి మాజీ వ్యాపార భాగస్వామి ఉల్రిక్‌ మెక్‌నైట్‌ ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. 2011లో యూపీఏ అధికారంలో ఉన్నపుడు ఈ కాంట్రాక్ట్‌ కుదిరింది. రాఫెల్‌ వివాదంలో 'అనిల్‌ అంబానీ'పై తీవ్రస్థాయి విమర్శలు సంధించిన రాహుల్‌ గాంధి ఈ 'స్కార్పియన్‌ డీల్‌' గురించి ఏమంటారని అధికారపక్షం ఇప్పుడు నిలదీస్తోంది. అంతేకాదు ఉల్రిక్ మెక్‌నైట్‌ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. 
 scorpion submarine of india కోసం చిత్ర ఫలితం
మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్రంలో రాహుల్‌ గాంధి చక్రం తిప్పుతున్న తరుణమది. 'స్కార్పియన్‌ జలాంతర్గాములు విడిభాగాల తయారీ, సరపరాకి సంబంధించి 2011 లో కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్‌కు చెందిన ‘నేవల్‌ గ్రూప్‌’ కంపెనీ తో  ఒప్పందం కుదుర్చుకుంది. దాని విలువ రూ. 20 వేల కోట్లు. ఈ కంపెనీ తన ఆఫ్‌ సెట్‌ కాంట్రాక్ట్‌లో భాగంగా విశాఖపట్నం లోని ఫ్లాష్‌-ఫోర్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి విడిభాగాల తయారీకి సబ్‌-కాంట్రాక్ట్‌ ఇచ్చింది. జలాంతర్గాముల నిర్మాణం ఫ్రాన్స్‌లో కొంత, ముంబైలోని మేగజాన్‌ డాక్‌ లిమిటెడ్‌ లో కొంత జరిగేది. మేగజాన్‌కు కావాల్సిన విడిభాగాలను ఫ్లాష్‌-ఫోర్జ్‌ సమకూర్చేది.  2011 లోనే ఫ్లాష్‌-ఫోర్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని ఆప్టికల్‌ ఆర్మర్‌ లిమిటెడ్‌ (ఓఏఎల్‌) అనే బ్రిటన్‌ కంపెనీని కొనుగోలు చేసింది.

2012 నవంబరు 8న ఫ్లాష్‌-ఫోర్జ్‌ సంస్థలోని ఇద్దరు అధికారులు ఓఏఎల్‌ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. అదే రోజున రాహుల్‌ గాంధి మాజీ వ్యాపార భాగస్వామి ఉల్రిక్‌ మెక్‌నైట్‌ అదే కంపెనీలో మరో డైరెక్టర్‌ గా నియమితుడయ్యాడు. ఆయనకు ఓఏఎల్‌లో 4.90 వాటా ఇచ్చారు. 2013 లో ఫ్లాష్‌-ఫోర్జ్‌ సంస్థ కాంపోజిట్‌ రెసిన్‌ డెవల్‌పమెంట్స్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అందులో కూడా మెక్‌నైట్‌ ఒక డైరెక్టరయ్యారు. ఫ్రెంచి కంపెనీ నేవల్‌ గ్రూప్‌ ఇచ్చిన వివరణ ప్రకారం దాని భారతీయ ఆఫ్‌-సెట్‌ భాగస్వాముల్లో ఫ్లాష్‌-ఫోర్జ్‌ కీలకమైనది. అంటే ఫ్లాష్‌-ఫోర్జ్‌తో లింక్‌ అయిన మెక్‌నైట్‌ ఈ వ్యాపార లావాదేవీల్లో, కాంట్రాక్టుల్లో కీలక భూమిక పోషించినట్లు స్పష్టమవుతోందని తేలిందని తాజా కథనాలు వివరిస్తున్నాయి.
Image result for rahul behind ₹20000 crore scam - Ulrik mcknight rahul gandhi partner
దీన్ని బట్టి అధికారంలో ఉన్నా లేకున్నా నెహౄ డైనాస్టీ కి ఆర్ధిక బలం ఇవ్వటంలో రాహుల్ గాంధి తన సమర్ధత నిరూపించుకున్నట్లే. "ప్రధానిని — కాపలాదారే  దొంగ అంటు భావి భారత ప్రధాని కావాలని కలలు కంటున్న ఈ విదేశీయుడు రాహుల్ గాంధి"  అంటూ వెలుగుచూస్తున్న వివరాల వెనుక పెద్ద స్కామే ఉందని అంటున్నారు బిజేపి నేతలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: