అక్షయ తృతీయ వస్తే చాలు దినపత్రికలన్నీ బంగారు నగల దుకాణాలు యాడ్లతో నిండిపోతాయి. ఆ రోజు బంగారం కొంటే మంచిదన్న ఓ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అసలు అక్షయ తృతీయ దక్షిణ భారతదేశ సంస్కృతి కాదు. ఉత్తర భారతం నుంచి దిగుమతి అయ్యింది. 


అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా.. కొంటే మంచిదేనా.. ఈ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏమంటున్నారంటే.... 

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం.. కలి పురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొమ్మని ఎవడు చెప్పాడో నాకు తెలియదు.. ఎక్కడా లేదు అలా కొనాలని.. అంటూ తీవ్రంగా విమర్శించారు. 

అదే సమయంలో అక్షయ తృతీయరోజు ఏం చేయాలో ఇలా సెలవిచ్చారు..

అక్షయ తృతీయ రోజు ఉదకభాండం దానం చేయాలి. స్వయంపాకం.. అంటే సొంతంగా వండినది ఇవ్వాలి.. ద్రవ్యం అంటే డబ్బు దానం చేయాలి..చెప్పుల జత ఇవ్వాలి. లేకపోతే గొడుగు ఇవ్వాలి. లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకానీ ఇలాంటి పిచ్చిపనులు చేసి.. బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే పాపం వృద్ధి అవుతుంది. 

ఇదీ సంగతి అసలు వాస్తవం ఇలా ఉంటే.. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదన్న ప్రచారాన్ని బాగా పెంచుతున్నారు. ఇది బంగారు వ్యాపారస్తులు చేస్తున్న పనే. దీనికితోడు బంగారంపై వ్యామోహం ఉన్న మహిళలు దీన్ని ఇంకాస్త ప్రచారం చేస్తున్నారు. అదీ అసలు సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి: