ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మే 23 వరకూ తేలని అంశమే. పోలింగ్ పూర్తవగానే అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలూ, పూర్తి విశ్వాసంతో విజయం తమదే నని చెప్పాయి. రెండు పార్టీ ల్లోనూ బయటికి  రెట్టించిన ఉత్సాహం కనిపించింది.


చిత్రమేంటంటే అప్పట్లో వచ్చిన సర్వేలు కూడా కొన్ని టీడీపీకీ,  చాలా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కి విజయం తథ్యమని చెప్పాయి. జ్యోతిష్యులు కూడా చంద్రబాబుకు సమయం బాగుందని కొందరు, వైఎస్ జగన్మోహన రెడ్ది జాతకమే కాదు తరుణం కూడా బాగుందని కొందరూ చెప్పారు. ఇలా టీడీపీ, వైసీపీ మధ్య ఫలితాల విషయంలో హోరా హోరీ కనిపించింది. రెండు పార్టీలు లోలోపల మాత్రం ఓటమిపై టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

various ap poll surveys favors YSRCP కోసం చిత్ర ఫలితం

ఒకవేళ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలన్న అంశంపై తొలి నుండీ జాగ్రత్త పడుతూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, సరికొత్త వ్యూహలతో ముందు కెళ్తున్నట్లు తెలు స్తోంది. అందులో భాగంగానే ఆయన, ఎన్నికలు జరిగాక, ఈవీఎంలు సరిగా పనిచెయ్యలేదనీ, వీవీప్యాట్లు సరిగా స్లిప్పులు చూపించట్లేదనీ ఆరోపణలు చేస్తూవచ్చి దానిని జనంలో పాతుకు పోయేలా చేశారు. దీని వెనక వ్యూహం అద్భుతం.

various ap poll surveys favors YSRCP కోసం చిత్ర ఫలితం

ANDHRA JYOTI SURVEY 

ఒకవేళ టీడీపీ ఓడిపోతే, తప్పంతా ఈవీఎం లదే అని జాతీయస్థాయిలో గళం వినిపించేందుకు ముందు గానే ఆయన జాతీయ స్థాయి నేతలను కలిసి, ఎకాయకీ సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ వేసే వరకూ వ్యవహారాన్ని తీసుకెల్టారన్న చర్చ నడుస్తోంది.

various ap poll surveys favors YSRCP కోసం చిత్ర ఫలితం

చూస్తుంటే కాలం గడుస్తూ ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ఆ తరవాత ఎన్నికల పలితాల ప్రకటనల వరకు - టీడీపీ గెలుపుపై చంద్రబాబులో పూర్తి గా నమ్మకం తరుగు తూ వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా, రెండు వారాలుగా వస్తున్న దాదాపు 20 సర్వేలను పరిశీలించిన చంద్రబాబు, వాటిలో చాలా వరకూ వైసీపీకే అధికారం దక్కుతుందని చెప్పడంతో ఆయనలో మరింత ఆందోళన ఉదృతమౌతున్నదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

Image result for CNX poll survey on AP

అసలీ సర్వేలను నమ్మితే లేనిపోని టెన్షన్లు తప్పవనుకున్న చంద్రబాబు, తనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి, క్షేత్ర స్థాయిలో ప్రతీ పోలింగ్ బూత్ నుంచీ టీడీపీ ఏజెంట్ల ద్వారా రిపోర్టులు తెప్పించు కుంటున్నారు. ఈనెల 22 వరకూ ఈ సమీక్షలు జరగనున్నాయి. రిపోర్టుల్లో వచ్చిన ఫలితాల్ని బట్టీ, టీడీపీకి ఏ స్థాయిలో ఓట్లూ, సీట్లూ దక్కుతాయన్న దానిపై ఒక అంచనా కు రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

India TV - CNX Latest Election Survey

*ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20, టీడీపీ 5.


ఐతే, ఏజెంట్లు వాస్తవ పరిస్థితిని చెబుతారా? ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి వ్యతిరేకంగా ఉంటే, ఆ వాస్తవాల్ని చంద్రబాబుకి ఉన్నదున్నట్లు వివరిస్తారా? అన్నది ఎప్పుడూ సంశయాస్పధమే. సమీక్షలతో వాస్తవం తెలుస్తుందన్న నమ్మకం లేకపోయినా, టెన్షన్ నుంచీ తప్పించు కునేందు కు, బిజీలో ఉండి చంద్రబాబు సమీక్షల్లో తలమునకలు అవుతున్నారన్న ప్రచారం జరుగు తోంది. ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోతే, చంద్రబాబు ఒప్పుకోరనీ, కచ్చితంగా జాతీయ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలూ చేయించి, మిగతా పార్టీల మద్దతు కూడగట్టి,  తిరిగి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపించేలా గట్టిగా పట్టుపడతారని తెలుస్తోంది.

various ap poll surveys favors YSRCP కోసం చిత్ర ఫలితం

అదే జరిగితే తమకు దక్కే అధికారం చేజారే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి కచ్చితంగా ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలనే (ఒకవేళ వైసీపీ ఓడిపోయినా సరే) తుది ఫలితాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాలని డిమాండ్ చెయ్యాలని అను కుంటున్నట్లు తెలిసింది. ఈ టెన్షన్లు ఉండటం వల్లే జగన్, తన విహార యాత్ర పర్యటనలు కూడా వాయిదా వేసుకున్నారని తెలిసింది.

Image result for CNX poll survey on AP

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించడమనే ప్రసక్తే ఉండదంటున్నారు ఎన్నికల అధికారు లు. 46 వేల ఈవీఎంలు వాడితే, 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించా యనీ, వాటిలోనూ 300 ఈవీఎంలను సరిచెయ్యగా, మరో 100 ఈవీఎంలను మాత్రం మార్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఫలితాలు ఎలా వచ్చినా, పార్టీ లు ఒప్పుకోవాల్సిందే తప్ప, ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: