"అంగట్లో అన్నీ ఉన్నా అల్లుణ్ణోట్లో శని ఉందన్నట్లు - ఆయనకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పేట్లు లేదు" అంటూ ‘దిన మలర్‌’ తమిళ ప్రఖ్యాత దిన పత్రిక  ‘ఆది లోనే హంసపాదా?’ అనే హెడ్-లైన్స్ లో ఒక వార్తా  కథనాన్ని ప్రచురించింది.  
Image result for nara lokesh defeat confirmed in mangalagiri - tamil dinamalar news
*తండ్రి ముఖ్యమంత్రి హోదా లో ఉన్నారు, 
*మంత్రిగా తగినంతకు మించి అధికారం చేతిలో ఉంది,
*డబ్బుకు కొదువలేదు - కావాల్సినంత డబ్బుంది,
*సహకరించే ప్రాణం పెట్టే మందీ మార్బలం కావలసినంత మంది ఉన్నారు

"ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా తండ్రై - పూర్తి అండగా ఉండి మాత్రం ఏమి ప్రయోజనం? అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును ఖరారు చేసుకోలేకపోయానే అని మదన పడుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగు దేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కుమారుడు, స్వయానా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌, ఆవేదనలో మునిగిపోయినట్లు ఉన్నారు.  
Image result for nara lokesh in mangalagiri
వారసత్వ రాజకీయాలే ప్రామాణికంగా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన ప్రియపుత్రుడుకి పార్టీలో, ప్రభుత్వంలో ఉచితాసనాన్ని అదిష్టింపజేసి గురుతర మైన బాధ్యతలు అప్పగించాడు. రాష్ట్రమంత్రిగా కూడా పట్టాభిషేకం చేశారు అదీ ఎమెల్సీగా నియమించి ఎన్నికల్లో గెలవకుండానే దొడ్డిదారిన మంత్రిగా నియమించటం తో ప్రజలు ఆయన్ని ఏమీ చేతగానివాడుగా చూశారు. ప్రజలు గమనించటం, ఆలోచించటం మొదలు పెట్టారు కనుకనే కనకపు సింహాసనాన్ని అనర్హుడికి కట్టబెట్టటం ఇష్టపడలేదని రాసింది.  
Related image
"అందుకే ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం సురక్షితంగా భావించి అక్కడనుండి ఎమెల్యే అభ్యర్ధిగా పోటీకి నిలబెట్టారు. ఈ నియోజక వర్గం వైసీపికి మంచి పట్టున్న ప్రాంతమని, ఇక్కడ గెలవడం అంత తేలిక సులభం కాదని ఓట్లడిగేందుకు వెళ్లిన తొలిరోజుల్లోనే నారా లోకేశ్‌కు తెలిసివచ్చింది. ప్రభుత్వం, అధికారం, ధనం, బలగం - నీతి నియమాలను ప్రక్కనబెట్టి ఏడాపెడా వినియోగించినా ఆయన ఈ ఎన్నికల సాగరంలో తీరం చేరలేక పోతున్నారని  రాసింది.  


'క్షేత్రస్థాయి నుండి నింగివరకు అందే  సమాచారం - ఆయనను ఓడిపోతామని భయం ఆవరించి ఉంది’ అని ఆ కథనంలో పేర్కొంది.  ‘నేను ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలు ఇవి, ఇందులో ఓడిపోతే ఆది లోనే హంస పాదు అనే ముద్ర పడిపోతుంది’ అనే భయానికి, భీతికి కంపించిపోతున్నారని దినమలర్  వ్యాఖ్యానించిందట. ఇదీ మన 'మందలగిరి మాలోకం' గారి జన అంగీకారంలేని రాజకీయనాయకుని కథ. 

Image result for nara lokesh in mangalagiri

మరింత సమాచారం తెలుసుకోండి: