సిగ్గు శరం లేని ఎమెల్యేలకు ఖమ్మం దిమ్మదిరిగే పరిస్థితులను కల్పిస్తుంది. తద్వారా తెలంగాణ రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించేలా చేస్తున్నారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రికి అన్న‌ట్లుగా వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అసలు ప్రజలు ఒక పార్టీ కి గెలిపిస్తే ఈ ఎమెల్యేలు అదే పార్టీలో కొనసాగాలి. లేకుంటే ప్రజలచేత గెలిపించబడ్డ ఎమెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ పతాకం కింద పోటీ చెయ్యాలి. అటు తెలంగాణా చంద్రుడు ఇటు ఆంధ్రా చంద్రుడు ప్రోత్సహించి వీళ్ళను ప్రతిపక్షాల నుండిఉ అధికారపక్షంలోకి గోడ దూకించటం ఏ మాత్రం నైతికత కాదు.   
Image result for yellandu mla haripriya
అందుకే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై శ‌నివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించగా, తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై ఇవాళ ప్రజలు ఎదురు తిరిగారు. దీంతో పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో జంపింగ్ ఎమ్మెల్యేల‌కు నిరసన సెగ తప్ప‌డం లేదంటున్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.
Image result for yellandu mla haripriya
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి వెళ్లారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దీంతో ప్రజలు ఆయన్ను నిలదీశారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయమని చెప్పి, ఇప్పుడు ఆ గుర్తుకు ఓటు వేయకుండా కారు గుర్తుకు వేయాలని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్థులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరగ‌డం తప్ప‌నిస‌రి అయింది.
Image result for pinapaka mla rega kanta rao
జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రికి వెంట‌ వెంట‌నే ఇలా తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌ లో చేరిన వారే కావ‌డం, ఒకే ఉమ్మ‌డి జిల్లాకు చేరిన వారు కావ‌డంతో, జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొత్తచ‌ర్చ మొద‌లైంది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌లై మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి చేరిన ఈ ప్ర‌తిఘ‌న దోర‌ణి, ఇత‌ర జిల్లాల‌కు, నియోజ‌క‌వ‌ర్గాల‌కు విస్త‌రిస్తే, ఎలా అని ప‌లువురు జంపింగ్ నేత‌ల్లో కొత్త భ‌యం మొద‌లైందంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: