ఈ మద్య డబ్బు సంపాదించడం పరమావధిగా పెట్టుకున్న కొంత మంది నేరస్థులు అందుకోసం దేనికైనా సిద్ద పడుతున్నారు.  డ్రగ్స్, స్మగ్లింగ్, అక్రమ ఆయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఒక్కటి కాదు ఎన్నో రకాలుగా ఈజి మనీ కోసం వెంపర్లాడుతున్నారు.  ఈ మద్య కొంత మంది దుర్మార్గులు ఓ అడుగు ముందుకు వేసి దేవాలయాలను టార్గెట్ చేసుకుంటున్నారు.  భారతీయులు ఎంతో భక్తి విశ్వాసాలు కలిగినవారని తెలిసిందే..అలాంటి భక్తి ముసుగులో కొంత మంది ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలకు అలంకరించిన సొమ్మునే దొంగిలిస్తున్నారు.

ఇలాంటి వ్యవహారాలు గతంలో విజయవాడ ఇటీవల తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి  ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన అమ్మవారు.. అధికారులు, పూజారుల నిర్లక్ష్యంతో బోసిపోయింది. అమ్మవారికి అలంకరించే  కిరీటంలో ఓ వజ్రం కొన్నిరోజుల నుంచి కనపడకుండా పోయింది.

అయితే దీనిపై పూజారులు కానీ, అధికారులు కాని దృష్టి పెట్టకపోవడం ఇప్పడు ఎన్నో అనుమానాలకు తావిస్తుంది.  గతంలో బాసర అమ్మవారి గుళ్లో గతంలో కూడా 2,3 సార్లు అపచారం జరిగింది. ఒకసారి అమ్మవారి విగ్రహాలను దేవరకొండకు తరలించారు. మరోక సారి అమ్మవారి ముక్కుపుడుక మాయం కావటం జరిగింది. ఆసమయంలో సంబంధిత ఉద్యోగులపై  చర్యలు తీసుకున్నారు. అది 2013 లోనే పోయిందని పూజారులు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారు. ఇన్ని రోజులుగా ఈ విషయం గోప్యంగా ఉంచారు.

ఈ విషయం 2 రోజుల క్రితం  మళ్లీ చర్చకు రావటం జరిగింది. వజ్రాన్ని ఎవరైనా దొంగిలించారా లేక ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగేటప్పుడు జారి పడిపోయిందా అనేది తేలాల్సి ఉంది. దీనిపై నిజం ఏంటో తెలపాలని..నిగ్గు తేలకపోతే ఆందోళన చేస్తామని భక్తులు అంటున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: