Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: పిల్లి – ఎలుక తరహా మోడీ - చంద్ర రాజకీయం - శ్రీచంద్ర నీతి

ఎడిటోరియల్:  పిల్లి – ఎలుక తరహా  మోడీ - చంద్ర రాజకీయం - శ్రీచంద్ర నీతి
ఎడిటోరియల్: పిల్లి – ఎలుక తరహా మోడీ - చంద్ర రాజకీయం - శ్రీచంద్ర నీతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రదాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్య పోరాటం ఆగలేదు. మోడీపై ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తూ దేశాటన చేస్తున్నారు. బీహారు ఎన్నికల సభలో ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు ఎలా ప్రస్తావించారో?  తెలియదు గాని, సందర్భాన్ని బట్టి  ఆయన కాంగ్రెస్ ను విమర్శించడానికి విభజన తీరు ను ప్రస్తావించి ,వాజపేయి పాలనలో మూడు రాష్ట్రాలు విభజించి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది రాలేదని, కాంగ్రెస్ హయాంలో ఎపిని విభజిస్తే,ఇప్పటికీ అక్కడ ముఖాలు చూసుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించి ఉండవచ్చు. 

నిజానికి ప్రధాని ఈ ప్రస్తావన తీసుకు రానవలసిన అవసరం లేదు. అయినా తెచ్చారు. దాంతో బ్రహ్మాస్త్రమో పాశుపతాస్త్రమో దొరికినట్లు చంద్రబాబు నాయుడు మోడీపై విరుచుకు పడ్డారు. అసలు మోడీకి ఎపి గురించి మాట్లాడే హక్కే లేదని, విభజనకు బిజెపి కూడా మద్దతు ఇచ్చిందని అన్నారు.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిసి కూర్చోని వారిమద్య విభేదాలను పరిష్కరించుకో లేకపోవడానికి  నరేంద్ర మోడీనే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఇలా పలు విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. నాలుగేళ్లు బాబు-మోడీ జోడి అంటూ బిజెపి-టిడిపి నాయకులు కలసిమెలసి తిరిగేవారు. నారా చంద్రబాబు నాయుడును, ముత్తవరపు  వెంకయ్యనాయుడు వచ్చి పొగిడి వెళితే, నరేంద్ర మోడీని అభినందిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానమే చేయించారు.

ఒక్కసారిగా నాలుగేళ్ల తర్వాత వీళ్ల మద్య చెడింది. అప్పటి నుంచి చంద్రబాబు ఉప్పు మాదిరి తయారై మోడీని నిప్పును చేసేసి పెట్రేగి పోవటం తెలుగువారంతా చూస్తూనే ఉన్నారు. అఖరకు సాంప్రదాయం మరచి బజారు భాష మాట్లాడే తెలుగు మహిళలు — ఫేడవుట్ అయిన తెలుగు నటి దివ్యవాణి తోను – థర్డ్ గ్రేడ్ భాషను అతి సునాయాసంగా వాడే సాధినేని యామిని అనబడే టిడిపి అధికార ప్రతినిధితో నరేంద్ర మోడీని తిట్టించారు చంద్రబాబు అదీ హస్తిన నడివీధుల్లో. 

మొదట తనను అరెస్టు చేస్తారేమోనని భయపడ్డ చంద్రబాబు ఎన్నికల సమయం నాటికి మోడీపై విరుచుకుపడడం ఆరంబించారు. నోటికి వచ్చినట్లు హద్దు లేకుండా మాట్లాడుతున్నారు. వాటిలో కొన్ని సత్యాలు, మరెన్నో అర్ద సత్యాలు, ఇంకొన్ని పూర్తి  అసత్యాలతో కలిపి సన్నివేశాలను ఒక మహా నటునిలా పండిస్తూ చంద్రబాబు మాట్లాడుతూ వస్తున్నారు. ఖూరిమికల దినములలో అన్న వేమన పద్యం గుర్తుకు రాకమానదు. 

తాజాగా  చంద్రబాబు చెప్పిన విషయాలను చూద్దాం! విభజనకు కాంగ్రెస్ , బిజెపియే కారణమా? టిడిపి కారణం కాదా? ఒకటికి రెండు సార్లు విభజన లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా? పార్లమెంటులో తెలంగాణ - టిడిపి పార్లమెంట్ సభ్యులు విభజనకు అనుకూలంగా ఎంత రభస చేశారో తెలియదా? తెలంగాణలో తన లేఖ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, అదే మనిషి నాలుక మడతేసి ఎపి లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ఆంద్రప్రదేశ్ ప్రజల పొట్ట గొట్టిందని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుది నాలుకా? తాటి మట్టా?  ఆ విషయాలు చెప్పకుండా తప్పంతా పూర్తిగా బిజెపిది – తాను మాత్రం నిప్పు అన్నట్లు మూతి ముడుస్తూ నొసలు చిట్లిస్తూ చంద్ర బాబు మాట్లాడు తుంటారు. 

ఎపి, తెలంగాణలు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నాయా?  రెండు రాష్ట్రాల ప్రజలు సఖ్యత గానే ఉన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కలిసిపోయారని ఇదే చంద్రబాబు ప్రచారం చేయలేదా? చంద్రబాబే కదా? అటు ఇటు తిరగి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలం అయి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు. ఆ దుగ్దతో కెసిఆర్ ను ఇష్టం వచ్చినట్లు దూషించిందీ చంద్రబాబే కదా! పిల్లి తాను కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదను కోవటం సిగ్గుమాలిన తనం కాక మరేమౌతుంది. 

నిజానికి నలభై ఏళ్ల అనుభవఙ్జుడినని, ఆ అనుభవంతోనే కొత్త రాష్ట్ర సమస్యలు పరిష్కారమౌతాయని 2104 లో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టి అప్పుపుల ఊబిలోకి నెట్టింది తానేకాదా!  మరి అలాంటి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చేయలేదని, మరొకరు చేయలేదని, విపక్షం అభివృద్ధిని అడ్డుకొంటుందని పొరుగు రాష్ట్రం పుల్లలు పెడుతుందని పలు రకాలుగా టిడిపి వైఫల్యాలను ఇతరులపై నేట్టేద్సి బ్రతికే జారత్వం ఎందుకు? అంటున్నారు అహ్కిలాంద్రులు. 

కెసిఆర్ కూడా ముప్పైఐదేళ్ల సీనియర్. ఒకనాడు చంద్రబాబుకు మంచి సలహాదారుకూడా! ఈద్దరు కలిసి కూర్చుని సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేక పోయారు. మద్యలో నరేంద్ర మోడీతో పనేమిటి? పిల్లీ ఎలుకల్లా – బచ్చా గాళ్ళలా కొట్లాడుకొని ఇద్దరు రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించటంలో పూర్తి వైఫల్యం చెందలేదా? 
ఈ పాపంలో అగ్రభాగం చంద్రబాబుది కదా? బిజెపితో కలిసి మెలిసి ఉన్నరోజుల్లో  ఎన్నడైనా విభజన సమస్యలపై కేంద్రంతో కాని, ప్రధాని మోడీతో కాని చంద్రబాబు మాట్లాడారా? ఎంతసేపు తన అధికారం పదిలంగా ఉంచుకోవటానికి, తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేయాలనే తపన – ప్రతిపక్షాన్ని శాసనసభలో నిలువనివ్వ కుండా ప్రతిపక్ష సభ్యులను సంతలో పశువుల్లా కొనేసిన అతి పెద్ద దుష్ట సాంప్రదాయం నెలకొల్పింది ఎవరు? 

బిజెపీతో మైత్రిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోకుండా తన సామాజిక వర్గ తన అనుచర గణాల ప్రయోజనాలకు తన బినామీల బాసట కోసం వాడేశారే గాని – రాష్త ప్రత్యేక హక్కు పొందేందుకు ప్రయత్నిచలేనే లేదు కదా!  కేంద్రంతో సఖ్యత ఉన్నంత కాలం జగన్ పై కేసులలో ఆయన్ని ఇబ్బందులకు గురిచెసేలా చేయని ప్రయత్నమంటూ లేదు. జగన్ పై ₹1500 కోట్ల అవినీతి అభియోగాలను ₹ లక్ష కోట్ల నేఱంగా ప్రచారం చేసిన చంద్రబాబు అంత్యదశ జైల్లొనే ఉండవలసి వచ్చే రోజులు కనిపిస్తున్నాయి.  చేసిన పాపం ఊరికే పోదు. కట్టి కుడుపు తుందని అంటున్నారు. నేను కొన్న ఎమ్మెల్యేలకు సీట్లు పంచటానికి శాసనసభ నియోజకవర్గాలు పెంచుకొనే యావ తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? 

అంతేకాదు. రాష్ట్రంలో ప్రజలు తగినంత ఆధిఖ్యత ఇచ్చినా ప్రతిపక్ష శాసనసభ్యులను కొనేయటానికి ముందే టి-టిడిపి ని బ్రతికించుకోవటానికి - తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ఎందుకు ప్రయత్నం చేశారు. “ఓటుకు నోటు కేసు” లో అడ్డంగా తెలుగు జాతి లో ప్రజాస్వామ్య ద్రోహిగా దొరికి పోయారు. అందుకే తెలంగాణా ప్రజలు 2018 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుద ముట్టించారు. 

ఓటుకు నోటు కేసు వలనే కాదా! హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజదానిగా వినియోగార్హత వదిలేసి గజనీ ంఅహమ్మద్ లాగా అమరావతికి రాత్రికి రాత్రికి బిచాణా ఎత్తేసి పారిపొయిన వైనం చరిత్రలో నిలిచిపోతోంది. ఈ ఆధునిక చారిత్రక సత్యాలు చెప్పకుండా ప్రధానినో, ప్రతిపక్ష న్రేతనో, పొరుగు ముఖ్యమంత్రినో తన వైఫల్యాల కు, స్వార్ధానికి, చేతగాని తనానికి బాధ్యులను చేయ బూనటం అత్యంత అరాచకం కాక ఏమౌతుంది. 

ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రధానిని, ఈవీఎంలను, వివిప్యాట్ లను తిడితే తనకు వరిగేది ఏమీ లేకపోయినా – ఎదుటివ్ ఆరిలో వీడి తీట వదల్చాలనే దుగ్ద ఎవరెష్ట్ లా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదు. అంతే కాదు రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై ఎవరైనా కక్ష తీర్చుకొవాలని ప్రయత్నించినా చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి ఏర్పడే అవకాశమే లేదు.  కాకపోతే  మోడీ పై ద్వేషం కాంగ్రెస్ తో,రాహుల్ గాందీతో స్నేహం బలపడటానికి ఎంతగానో ఉపయోగపడవచ్చను కుంటే దానికి మించిన అమాయకత్వం ఉండనే ఉండదు. ఒకవేళ రాహుల్ అధికారంలోకి వచ్చినా – డైనాస్టీని గతంలో ఏపిలో తుదముట్టించిన వైనం సొనియాకు చాలా ఙ్జాపకం ఉంది - చంద్రబాబును అది మూడోకంటికి తెలియ కుండా రాజకీయంగా మట్టుపెట్టగలదనేందుకు సందేహమే లేదు. 

ఇక ఎపికి నరేంద్ర మోడీ ఏమి చేయలేదని చంద్రబాబు ఇప్పుడు రాగం ఆలపిస్తున్నారు.మరి గతంలో ఒకటికి రెండు సార్లు కేంద్రం అది చేసింది. ఇది చేసింది. బ్రహ్మాండం బ్రద్దలైంది భూగోళం తరించింది అని సాక్షాత్తూ శాసనసభలో తీర్మానం చేసి చెప్పింది చంద్రబాబు కాదా! వీటికి వివరణ ఇచ్చి,  అప్పుడు నరేంద్ర మోడీని అయినా, మరెవరిని అయినా చంద్రబాబు విమర్శించవచ్చు. అది చేయకుండా చంద్రబాబు చేస్తున్న రాజకీయం అంతా ఆయనకు విశ్వసనీయత లేదని పదే, పదే చెప్పేదే అవుతుంది.

పదిసార్లు ఒకే అబద్ధం చెపితే  అది గోబెల్ సూక్తి.  పదిసార్లు నాలుక మడతేసి గతచరిత్ర మరచి యూ-టర్న్ తీసుకొని మాట్లాడితే అది శ్రీచంద్ర సూక్తి అని చరిత్ర చెప్పబోతోంది
ap-election-news-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
బీజేపీ 100 స్థానాలకే పరిమితం : మమత జోస్యం: కాదు 300 స్ధానాలు గెలుస్తాం: మోదీ ధీమా
'ఇవ్వడం' మాత్రమే 'దాంపత్య పరిమళం' వ్యాపింప జేస్తుంది
నేడు నృసింహజయంతి: మానవదేహంతో శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి: తీర్ధక్షేత్రం
కరిష్మాలేని హీరో రాహుల్: ప్రభుత్వ వైఫల్యాలను బ్లాస్ట్ చేయటంలో వైఫల్యం: పీపుల్స్ పల్స్
సోనియా పిలిస్తే తోకూపుతూ వెళ్ళటానికి మానేత అవకాశవాది చంద్రబాబు కాదు: వైసీపి
టోటల్ క్లియర్: రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులు
పనిగట్టుకొని నా పేరును చెడగొట్టటం న్యాయం కాదు:  ఛానెల్‌పై సినీ నటి ఆగ్రహం
అధికారంరాదు అనే అనుమానానికే ఆయన అసహన సార్వబౌముడైతే ఎలా?
పశ్చిమబెంగాల్‌ లో విచ్చలవిడి గుండారాజ్
ఇప్పటికే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా! చట్టుబండలైన ఫిరాయింపుల చట్టం!
తెలంగాణాలో ఆ రెండు పార్లమెంట్ స్థానాలలో బీజేపి గెలవబోతోంది: మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
చిక్కిపోతున్న మామ! చందమామ
నరేంద్ర మోడీకి మమత బెనర్జీకి ఇప్పుడు బేధమేముంది?
స్టాలిన్ కు షాక్!  బీజేపీ విజయం తధ్యం: డీఎంకే బిజేపితో పొత్తు కు సై :  తమిళ సై సౌందర రాజన్
షాకింగ్ : మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఎడిటోరియల్: వైఎస్ జగన్ కాలకూట విషాన్ని పిండ గలడా! కౌంట్-డౌన్ మొదలైంది
తాటి ముంజెలు తినే వేళ ఇదే!  పరిపూర్ణ ఆరోగ్యం కోసం ముంజెలు తినాల్సిందే
వైఎస్ఆర్ దయవల్లనే ఆయనకు పెన్షన్ వచ్చే ఉద్యోగం వచ్చింది: ఉండవల్లి జ్యోతి అరుణ కుమార్
షాకింగ్ పోలిటిక్స్: తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల ముద్ధుల మొగుడే స్టాలిన్
About the author