టీవీ నైన్ సీఈవో రవి ప్రకాశ్ పై హైదరాబాద్ లో ఫోర్జరీ కేసు నమోదైంది.. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడే రేపో రవిప్రకాశ్ విచారణకు హాజరుకావచ్చు. కానీ ఈ ఉదంతం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా.. ఎవరైనా ఆయన్ను టార్గెట్ చేశారా..?  ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి.


టీవీ నైన్ మొదటి నుంచి కాస్త తటస్థ వైఖరి అవలంభించినా.. చాలాసార్లు చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకుంది. అందుకే జగన్ వంటి వారు దాన్ని ఎల్లో మీడాయాలో కలిపేశారు. అప్పట్లో ఎవడి గోలవాడిది కార్యక్రం కారణంగా తెలంగాణలో టీవీనైన్‌ ను కొన్నాళ్లపాటు రాకుండా చేశారు. 

ఆ తరవాత రాజీ కుదిరింది. అయినా టీవీ నైన్ చంద్రబాబు అనుకూల వైఖరి మారలేదన్న వాదన ఉంది. ఈ సమయంలో టీవీ నైన్ ను తెలంగాణ సీఎం సన్నిహితుడుగా పేరున్న పారిశ్రామికవేత్త మైహోమ్ రాజేశ్వరరావు కొన్నారు. దీంతో ఇక టీవీ నైన్ కూడా గులాబీ ఛానల్ అవుతుందనుకున్నారు. 

కానీ అలాంటి పోకడ ఏమీ కనిపించకపోగా.. చంద్రబాబు అనుకూల వైఖరి కొనసాగింది. పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో మొన్న ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో హఠాత్తుగా రవిప్రకాశ్ తెర పైకి వచ్చి ఇష్యూను బాగా హైలెట్ చేశారు. దీంతో తెలంగాణ సర్కారు డిఫెన్సులో పడింది. ఈ ఉదంతం తర్వాత ఇకలాభం లేదనుకున్ని రవిప్రకాశ్ పై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: