కాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబంపై జనాల్లో మంచి అభిప్రాయమే ఉంది. వారిది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. 1985లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ధర్మాన ప్రసాదరావు గెలిచారు. అలాగే 1989లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినపుడు మంచి గుర్తింపు పొందారు. ఇక వైఎస్సార్ ముఖ్య అనుచరునిగా ధర్మాన ఉంటూ జనాభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఇక కీలకమైన మంత్రిత్వ శాఖలను వైఎస్సార్ టైంలో ఆయన దక్కించుకున్నారు. 2009లో అసెంబ్లీ పునర్విభజన టైంలో ధర్మాన శ్రీకాకుళానికి షిఫ్ట్ అయి తొలిసారి జెండా ఎగురవేశారు. ఇక 2014 నాటికి సార్వత్రిక  ఎన్నికల్లో చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వేరుపడి వైసీపీ తరఫున పోటీ చేసిన ధర్మాన శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లో ఓటమి పాలు అయ్యారు. 



ఇక గత అయిదేళ్ళుగా ధర్మాన శ్రీకాకుళంలో ఉంటూ తన ఓటమికి గల కారణాలను మధింపు చేసుకున్నారు. జనానికి చేరువ కావడమే కాకుండా దూరంగా ఉన్న సామాజిక వర్గాలను చేరువ చేసుకున్నారు. కళింగ కోమట్లు ఈసారి ఎన్నికల్లో ధర్మాన వైపునకు వచ్చి పనిచేశారు. అలాగే జగన్ పాదయాత్ర, పెరిగిన వైసీపీ మైలేజ్ ఇవన్నీ ధర్మాన గెలుపునకు బాటలు వేస్తాయని భావిస్తున్నారు. ఇక శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న  ప్రభుత్వ ఉద్యోగుల తీర్పు ఈసారి వైసీపీకి అనుకూలం అవుతుందని కూడా ఆశిస్తున్నారు. అయితే ప్రత్యర్ధి అయిన టీడీపీ అభ్యర్ధి గుండా లక్ష్మీ దేవి కూదా గట్టి అభ్యర్ధిగా ఉన్నారు. మహిళ కావడం, అభివ్రుధ్ధి పనులు ఎక్కువగా చేయడంతో ఆమె గెలుపుపైన కూడా టీడీపీ బలమైన నమ్మ‌కంతో ఉంది మొత్తానికి ధర్మాన గెలిస్తే తక్కువ మెజారిటీతోనైన బయటపడతారని అంటున్నారు.



మరో వైపు ధర్మాన అన్న అయిన క్రిష్ణ దాస్ ఈసారి కచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. అన్ని సర్వేలు కూడా నరసన్నపేటలో క్రిష్ణదాస్ విజయం ఖాయమని చెబుతున్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా ఉన్న బగ్గు లక్ష్మణరావు మీద కొంత వ్యతిరేకత ఉండడం, రెండు సార్లు గెలిచిన  క్రిష్ణదాస్  సౌమ్యుడు మంచివారు అన్న సానుభూతి జత కలవడంతో  గెలుపు సాధిస్తారని అంటున్నారు.  పైగా ఇది ధర్మాన కుటుంబం సొంత ప్రాంతం కావడం కూడా అనుకూలమైన పరిణామంగా ఉంది.  దీనికి తోడు పెరిగిన టీడీపీ వ్యతిరేకత కూడా ఫ్యాన్ స్పీడ్ ని పెంచుతోందని చెబుతున్నారు. జగన్ కి ఇష్టుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ణదాస్ మళ్లీ అసెంబ్లీకి ఈసారి వెళ్తారని అంతా నమ్మకంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: