అత్యంత ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న తెలియ‌ను న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈవీఎంల‌లో ఆయా అభ్య‌ర్థుల జాత‌కాలు నిక్షిప్త‌మైన నేప‌థ్యంలో ఈ నెల 23న వాటి దుమ్ముదులిపి.. లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్నారు. అయితే, ఈ ద‌ఫా పోలింగ్‌, ఫ‌లితాల‌కు చాలా గ్యాప్ ఉండ డంతో ఫ‌లితాల‌పై ఆస‌క్తి, ఉత్కంఠ కూడా భారీగా పెరిగాయి. ఇక‌, దేశ‌వ్యాప్తంగా ఈ సారి అన్ని విప‌క్షాలు కోర్టును ఆశ్ర‌యిం చ‌డంతో ఈ ద‌ఫా.. వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను కూడా లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని ప్ర‌కారం ప్ర‌తి నియో జ‌క‌వ‌ర్గంలోనూ ర్యాండ‌మ్‌గా ఐదు వీవీప్యాట్ల‌లోని స్లిప్పుల‌ను లెక్కిస్తారు. దీంతో ఫ‌లితాల వెల్ల‌డి దాదాపు 6 గంట‌లు ఆల శ్యం అవుతుంద‌ని అంటున్నారు. 


ఇక ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి, ఓట‌ర్ల సంఖ్య‌, ఓటింగ్ జ‌రిగిన తీరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకు ని 18 నుంచి 23 టేబుళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, 23వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ఓట్ల‌ కౌంటింగ్ ప్ర‌క్రి య ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనూ కౌంటింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే విద్యుత్‌, తాగునీటి వ‌స‌తుల‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభిం చారు. విడ‌త‌ల వారీగా ఓట్ల లెక్కింపు, ఈవీఎంల ప‌నితీరుపైనా శిక్ష‌ణ ఇస్తున్నారు. 23వ తేదీన ముందుగా బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తారు. 8 గంట‌ల‌కు కౌంటింగ్ ఏజెంట్ల స‌మ‌క్షంలో కౌంటింగ్ ప్రారంభ‌మ‌య్యాక తొలి అర‌గంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు త‌ర్వాత ఈవీఎంలను, ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గానికి ఐదు చొప్పున వీవీ ప్యాట్‌ల‌ను కూడా లెక్కిస్తారు. 


ప్ర‌తి ప‌దిని మిషాల‌కు ఓ రౌండ్ కౌంటింగ్ చొప్పున లెక్కించి రౌండ్ల వారీగా ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు. 10 గంట‌ల‌కు ట్రెండ్స్ వ‌చ్చేస్తాయి. అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఓట్లను ఓకే చోట‌ లెక్కిస్తారు. రాష్ట్రంలోని చాలా వ‌ర‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు దాదాపు రెండు జిల్లాల ప‌రిధిలో ఉన్నాయి. బాపట్ల‌, రాజ‌మండ్రి, అర‌కు వంటివి రెండు జిల్లాల్లో విస్త‌రించి ఉన్నాయి. ఇక‌, అర‌కు పార్ల‌మెంటు ప‌రిధి అయితే, నాలుగు జిల్లాల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్ల‌మెంటుకు ప‌డిన ఓట్ల‌ను కూడా ఆయా జిల్లాల ప‌రిధిలోనే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపే లెక్కింపు ప్ర‌క్రియ చేప‌డ‌తారు. 


లెక్కింపు ప్ర‌క్రియ చేప‌డ‌తారు.ముందుగా లెక్కింపు ప్ర‌క్రియ‌లో బ్యాలెట్‌, త‌ర్వాత ఈవీఎంలు, ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గాల్లోని వీవీ ప్యాట్ స్లిప్పులు కూడా లెక్కిస్తారు. పార్ల‌మెంటు ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ లెక్కింపు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఇక‌, దీనిని ప‌ర్య‌వేక్షించేందుకు కూడా భారీ ఎత్తున పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. జిల్లాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఈవీఎంల లెక్కింపు పూర్త‌యినా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. ఈ ప్ర‌క్రియ‌కు మొత్తం 5-6 గంట‌ల టైం ప‌డుతుంది. అందుకే తుది ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేందుకు సాయంత్రం... కొన్ని చోట్ల అర్ధ‌రాత్రి అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: