టీవీ9 కొత్త యాజమాన్యం.. ఆ ఛానల్ పాత సీఈవోపై పెట్టిన కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాశ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ రవిప్రకాశ్ వాటిని కావాలనే పట్టించుకున్నట్టు కనిపించడంలేదు. 


రవిప్రకాశ్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ మేనేజర్ మూర్తి పోలీసుల విచారణకు హాజరైనా.. రవిప్రకాశ్ మాత్రం హాజరు కాలేదు. అంతే కాదు. తనకు పది రోజుల గడువు కావాలని రవిప్రకాష్ తన లాయర్ ద్వారా పోలీసులను కోరారు. కానీ ఆ పప్పులేమీ పోలీసుల వద్ద ఉడికిన దాఖలాలు లేవు. 

అయినా పోలీసులు ఈ నోటీసు ఇచ్చారు. కాగా మాజీ సిఎఫ్ ఓ మూర్తిని శనివారం కూడా పోలీసులు విచారించారు.పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

రవిప్రకాశ్ కూడా విచారణకు సహకరించకపోతే.. తీవ్ర చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుపుతున్నాయి. ఫోర్జరీ కేసు ఎదుర్కుంటున్న రవిప్రకాష్ కు పోలీసులు మరోసారి నోటీసు ఇచ్చారు. విచారణకు ఆదివారం హాజరు కావాలని అందులో కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: