స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో తన చెన్నై పర్యటనకు ముందు కేసీఆర్.. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు.  రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం, నల్గొండ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసింది.


అభ్యర్థుల ఖరారు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్ విషయమై భేటీ కానున్నారు.   ఈ ఏడాది మార్చి 29వ తేదీతో మహమూద్ అలీ టర్మ్ పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీగా ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు కేసీఆర్.  బీసీ సామాజిక వర్గం నుండి  ఎగ్గే మల్లేశంకు కేసీఆర్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. 


2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మహబూబాబాద్ నుండి విజయం సాధించిన సత్యవతి రాథోడ్‌కు  ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2014 ఎన్నికలకు ముందు ఆమె టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఐదు స్థానాలకు  ఈ ఏడాది మార్చి 12 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఖరారు అనంతరం సీఎం  కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్ విషయమై భేటీ కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: