గత నెలలో తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.  ఆ ఫలితాలు అన్నీ తప్పుడు తడకలే కావడంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు, గ్లోబరినా అనే ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం వల్లో జరిగిందని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. 

ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి రీవ్యాలుయేషన్, రీ కౌంటింగ్ మళ్లీ చేపట్టారు. కానీ ఈ వివాదం మాత్రం  ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాల వెల్లడికి తేదీని విద్యాశాఖ వెల్లడించింది.

సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు పదో తరగతి ఫలితాల్లోనూ పునరావృతం కాకుండా విద్యాశాఖ తగు జాగ్రత్తలు తీసుకుంది. రేపు ఉదయం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: