ఏ ప్రభుత్వంలోనైనా జీవోల జారీ ప్రక్రియ సహజమే. ప్రతి జీవోను ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంచుతారు. కానీ రహస్య జీవోలను ఉంచాల్సిన అవసరం లేదన్న వెసులు పాటు ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏపీ సర్కారు అడ్డగోలుగా జీవోలు ఇస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. 


చంద్రబాబు ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టని రహస్య జీవోలన్నింటిని గవర్నర్‌ జోక్యం చేసుకుని బయటపెట్టాలని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. వందల జీవోలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని, తన విమానం అద్దెలు, దొంగ చెల్లింపుల జీవోలన్నింటిని దాచి పెట్టారని, కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగానే బాబు బండారం బయటపెట్టాలని విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోకి నెట్టారంటూ ముఖ్యమంత్రిని విజయసాయిరెడ్డి  నిలదీశారు. ఏటా రూ.650 కోట్ల నష్టాలు వస్తుంటే తమరు నియమించిన ఎండీ సురేంద్రబాబు ఏం చేసినట్లు?. పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజీగా ఉన్నాడా? అని సూటిగా ప్రశ్నించారు. 

అనంతపురంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని మరణ మృదంగం మోగుతోందని, వేలాది కుటుంబాలు కర్ణాటకకు తరలిపోతున్నాయని, పశువులు, గొర్రెలు మేత లేక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మరి రెయిన్‌ గన్ల స్టోరీలు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఎన్నాళ్లు మోసం చేస్తురని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: