ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు మాదే అంటున్నారు. పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి చంద్రబాబు ఇదే స్టాండ్ మీద ఉన్నారు. మొదట 120,  ఆ తర్వాత 130.. ఆ తర్వాత 150.. ఇలా సీట్ల సంఖ్య పెంచుతూ వచ్చారు. 


పార్టీ క్యాడర్లో జోష్ లేకపోయినా బాబు లెక్క మాత్రం తగ్గలేదు. మరి చంద్రబాబు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారు.. ఆయన లెక్క వెనుక కథ ఏంటీ.. ఈ విషయం ఆరా తీస్తే.. అదంతా పార్టీ శ్రేణులను కాపాడునే ప్రయత్నంగానే తెలుస్తోంది. 

ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులను చకచక క్లియర్‌ చేయించుకుంటున్నారని విజయసాయి ఆరోపించారు. 

చంద్రబాబు ఈ నెల 23న  రిటర్న్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మే 23న ఎలాగూ ఫలితాలు వస్తాయి.. కాబట్టి అప్పటి వరకూ కాస్త ధైర్యం చూపితే.. వచ్చాక ఎలాగూ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు కదా. ఇదీ బాబుగారి పాలసీ అంటున్నారు వైసీపీ నాయకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: