నిరుద్యోగుల బ‌ల‌హీన‌త‌ల‌ను ప‌ట్టుకుని కొంద‌రు దుర్మార్గులు ఎక్క‌డికైనా తెగిస్తున్నారు. యువ‌తులకైతే ఇంకా దారుణం.. నీకు ఉద్యోగం కావాలా.. అయితే నీ న్యూడ్ ఫోటోలు పంపించు.. అప్పుడే నీకు ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఆ ఉద్యోగం వేరేవాళ్ల‌కు ఇచ్చేస్తాం చాలా మంది ఉన్నారు ఉద్యోగం కోసం అంటూ దాబాయింపు చేశారు. ఉద్యోగం అవ‌స‌ర‌మున్న ఆ యువ‌తి చేసేది ఏమీ లేక త‌న న్యూడ్ ఫోటోలు పంపించింది. అప్ప‌డే వారిలోని కీచ‌కుడు బ‌య‌ట‌కొచ్చాడు. ఆమె న్యూడ్ ఫోటోల‌ను అడ్డం పెట్టుకుని వేధించాడు. త‌మ కోరిక తీర్చ‌క‌పోతే ఇంట‌ర్నెట్ లో అప్‌లోచేస్తామంటూ బెదించాడు. ఈ టైమ్‌లో ఆ యువ‌తి క‌రెస్ట్ డిసిష‌న్ తీసుకుంది. వారి వేధింపుల‌కు లొంగ‌కుండా షీ టీమ్స్ ను ఆశ్ర‌యించింది. దీంతో వారి ఆట క‌ట్టించిన పోలీసులు.. క‌ట‌క‌టాల్లోకి నెట్టేశారు. తాజాగా అదే ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. 


మియాపూర్‌కు చెందిన ఒక యువ‌తిని ప్ర‌దీప్ అనే యువ‌కుడు ట్రాప్ చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆమె పోన్ నెంబ‌ర్ సంపాధించాడు. ఉద్యోగం పేరుతో ఆ యువ‌తికి కాల్ చేశాడు. ఇలా ప్ర‌ముఖ హోట‌ల్ నుంచి మాట్లాడుతున్నాన‌ని మా హోట‌ళ్లో రిసెఫ్ష‌నిష్టు ఉద్యోగం ఉంద‌న్నాడు. అప్ప‌టికే అనుమానం వ‌చ్చిన ఆ యువ‌తి మా నెంబ‌ర్ మీకెక్క‌డి నుంచి వ‌చ్చింది.. నేను అప్లై చేయ‌లేదు.. అని ప్ర‌శ్నించింది. అందుకు అతను ఆన్‌లైన్ నుంచి మీ రెజ్యూమ్‌ను సేకరించామని చెప్పాడు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆ యువతి అతడి మాటలు పూర్తిగా నమ్మేసింది. ఆ తర్వాత హెచ్ఆర్ మేనేజర్ అర్చనా జగదీష్ పేరుతో ఓ మహిళ వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేసింది. 


ఆ తర్వాతి రోజు యువతికి ఫోన్ చేసి మీరు ఫస్ట్ రౌండ్‌లో సెలెక్ట్‌ అయ్యారని చెప్పింది. అనంతరం నీ నగ్న చిత్రాలు వాట్సాప్‌ చేయాలని కండీషన్‌ పెట్టగా ఆ యువతి ఒప్పుకోకుండా ఫోన్ కట్ చేసింది. వెంటనే మరోసారి ఫోన్‌ చేసి ఆ ఫొటోలు కేవలం నేను చూసి వెంటనే డిలీట్‌ చేస్తామని నమ్మించింది. లేదంటే నీ ఉద్యోగం వేరేవాళ్ల‌కు ఇస్తాన‌ని ద‌బాయించింది. ఉద్యోగం అవసరమున్న ఆ యువతి చేసేదిలేక తన నగ్న చిత్రాలను వాట్సాప్‌లో పంపించింది. 


అక్క‌డే అస‌లు విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. ఫస్ట్ త‌న‌తో మాట్లాడిన ప్ర‌దీప్ మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ యువ‌తికి ఫోన్ చేశాడు. త‌న న్యూడ్ ఫోటోలు చూసిన అత‌డు.. ఆమె న‌గ్న చిత్రాల గురించి వ‌ర్ణించ‌డం మొద‌లు పెట్టాడు. అంతే కాదు అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలంతో వేధించాడు. ఇక చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన స‌ద‌రు యువ‌తి షీ టీమ్స్ ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదు రంగంలోకి దిగిన సైబ‌రాబాద్ షీటీమ్స్ బృందం నిందితులు ప్ర‌దీతో స‌హా మ‌రో మ‌హిళ ఆట‌క‌ట్టించింది. వారిపై కేసు న‌మోదు చేసి క‌ట‌క‌టాల్లోకి నెట్టేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: