తెలంగాణలో గత నెల ఇంటర్ ఫలితాలు అన్నీ తప్పుల తడకగా రిలీజ్ కావడం 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చూశాం.  దీనిపి తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు ఇంటర్ బోర్డు వద్ద పెద్ద యుద్దమే చేశారు.  దాంతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం దీనిపై త్రి సభ్య కమిటీ వేయడం..ఆ కమిటీ ఇంటర్ బోర్డు, గ్లోబరినా వైఫల్యం ఉందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో నేడు వెలువడుతున్న పదవతరగతి పరిక్ష ఫలితాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  నేడు తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు.  ఈ ఏడాది మార్చి 16 నుండి ఏప్రిల్ 3 వతేదీ వరకు నిర్వహించారు.

రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అన్ని జిల్లాల కంటే ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించినట్టుగా ఆయన ప్రకటించారు.  9 స్కూళ్లలో సున్నా శాతం రిజల్ట్. బాలురు 91.18 శాతం, బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 1580 ప్రభుత్వ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. ఫలితాల్లో జగిత్యాల ఫస్ట్...హైదరాబాద్ లాస్ట్. 

ప్రైవేటులో 56.53 శాతం ఉత్తర్ణత. ఫలితాల్లో బాలికలతే పై చేయి. 98.78 శాతంత అత్ర స్థానంలో బిసి వెల్ఫేర్ స్కూల్స్. గతంలో కంటే 8 శాతం పెరిగిన ఉత్తీర్ణత.  10 జూన్ నుంచి 24 జూన్ వరకు సప్లమెంటరీ పరీక్షలు.  పరీక్ష ఫీజు చివరి తేది మే 27... 4వేల 370 సూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: