అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన చేస్తా... ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా చేస్తా.. గతంలో జగన్ ఇచ్చిన హామీ ఇది. ఇప్పుడు ఇది అమలవబోతోందా.. అప్పుడే అధికారులు ఆ పని ప్రారంభించేశారా..? 


ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 10 జిల్లాలను 33కు పెంచుకున్నారు. ఏపీలో మాత్రం ఎప్పట్లాగే 13 జిల్లాలే ఉన్నాయి. కేసీఆర్ ఈ విషయంలో చొరవ చూపినా.. చంద్రబాబు మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. ఎన్నికల ముందు మాత్రం తిరిగి అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉన్నా.. వైసీపీకి అనుకూలంగా ఉండే ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు ఇప్పటికే జిల్లాల విభజనపై పని ప్రారంభించేశాట.  కొత్తగా ఎన్ని జిల్లాలు పెంచవచ్చు, వాటికి జిల్లా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చెయ్యాలి అనే విషయంపై కసరత్తు చేస్తున్నారట. ముందుగా జగన్ భావిస్తున్నట్టు 25 జిల్లాలు కాకుండా ఈ సంఖ్య 30 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. 

జిల్లాల విభజన మంచి ఆలోచనే అయినా ఇందుకు కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. కేసీఆర్ మోడీ సర్కారుతో మంచిగా ఉండి ఈ పనులు చేయించుకున్నారు. రేపు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తే జిల్లాల విభజన సులభం అవుతుంది. కాకపోతే మాత్రం కాస్త ఇబ్బందే.



మరింత సమాచారం తెలుసుకోండి: